Tamil Actress Radha : హింసిస్తున్నాడని రెండో భర్తపై రెండోసారి ఫిర్యాదు చేసిన నటి రాధ

సుందర్ ట్రావెల్స్, హడావిడి, గేమ్ తదితర తమిళ చిత్రాల్లో హీరోయిన్‌గా  నటించిన రాధ తన రెండో భర్త, హింసించి బాధ పెడుతున్నాడని రెండోసారి పోలీసులను ఆశ్రయించారు.

Tamil Actress Radha Files A Complaint

Tamil Actress Radha :  సుందర్ ట్రావెల్స్, హడావిడి, గేమ్ తదితర తమిళ చిత్రాల్లో హీరోయిన్‌గా  నటించిన రాధ తన రెండో భర్త, హింసించి బాధ పెడుతున్నాడని రెండోసారి పోలీసులను ఆశ్రయించారు. మనస్పర్ధల  కారణంగా మొదటి భర్త నుంచి విడాకులు తీసుకుని కొడుకు, తల్లితో కలిసి జీవిస్తున్న రాధ, కొద్ది నెలల క్రితం ఎన్నూరు పోలీసు స్టేషన్ సబ్ ఇన్ ఇన్స్‌పెక్టర్ వసంత రాజాను రెండో వివాహం చేసుకున్నారు.

ఏప్రిల్ నెలలో వసంతరాజా  తనని హింసిస్తున్నాడంటూ విరుగంబాక్కం పోలీసు స్టేషన్‌లో  ఒకసారి ఫిర్యాదు చేశారు.  ఆ ఫిర్యాదులో తనపై అనుమానం పెంచుకున్నారని, కొట్టి చిత్రహింసలకు గురిచేస్తున్నారని ఆరోపించారు. ఆ ఫిర్యాదు తర్వాత ఇద్దరూ కలిసి సమస్యను పరిష్కరించుకుని  గత 3 నెలలుగా కలిసి జీవిస్తున్నారు.

కాగా… ఇటీవల వసంతరాజా, అతని స్నేహితులైన సబ్ ఇన్‌స్పెక్టర్‌లు భారతి, ఇళంవరుదిలతో  కలిసి బెదిరింపులకు పాల్పడుతున్నారని తాజాగా ఆరోపిస్తూ ఫిర్యాదు చేసారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.