Life Imprisonment: విద్యార్థినికి అబార్షన్‌ చేయించిన వ్యక్తికి యావజ్జీవ శిక్షలు

విద్యార్థినికి మాయమాటలు చెప్పాడు.. ఆపై లైంగిక దాడికి పాల్పడ్డాడు.. చివరికి ఆ బాధిత బాలిక గర్భం దాల్చింది. గుట్టుచప్పుడు కాకుండా ఆమెకు అబార్షన్ చేయించాలని అనుకున్నాడు. ఏదో మాత్రలు ఇచ్చి వేసుకోవాలని బలవంతం చేశాడు.

Life Imprisonment: విద్యార్థినికి అబార్షన్‌ చేయించిన వ్యక్తికి యావజ్జీవ శిక్షలు

Tamilnadu Young Man Sentenced To Life Imprisonment In Molestation Case

Updated On : May 7, 2021 / 11:12 AM IST

Tamilnadu Young Man Life Imprisonment : విద్యార్థినికి మాయమాటలు చెప్పాడు.. ఆపై లైంగిక దాడికి పాల్పడ్డాడు.. చివరికి ఆ బాధిత బాలిక గర్భం దాల్చింది. గుట్టుచప్పుడు కాకుండా ఆమెకు అబార్షన్ చేయించాలని అనుకున్నాడు. ఏదో మాత్రలు ఇచ్చి వేసుకోవాలని బలవంతం చేశాడు. దాంతో బాలికకు అబార్షన్ అయి ఆరోగ్యం బాగా క్షీణించింది. బాధిత బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడి అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు.

అతడికి కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. పుదుక్కోట్టై సత్యమంగళం పసుంపొన్‌నగర్‌కు చెందిన సురేష్‌ (32).. అదే ప్రాంతానికి చెందిన విద్యార్థినిపై పలుమార్లు లైంగిక దాడి చేశాడు. విద్యార్థిని గర్భం దాల్చడంతో అబార్షన్‌ చేయించాడు.

పోక్సో చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడు సురేష్‌ను అరెస్టు చేశారు. పుదుక్కోట్టై మహిళా కోర్టులో విచారణ జరిగింది.. లైంగికదాడి నేరానికి ఒక యావజ్జీవశిక్ష, అబార్షన్ చేయించినందుకు మరో యావజ్జీవశిక్ష విధించారు.