Tarnaka Family Dead : చెన్నైకి వెళ్లే విషయంలో గొడవ.. తార్నాకలో నలుగురి అనుమానాస్పద మృతి కేసులో షాకింగ్ విషయాలు
హైదరాబాద్ తార్నాకలో నలుగురి అనుమానాస్పద మృతి కేసులో కీలక విషయాలు బయటపడ్డాయి. మృతుడు ప్రతాప్ కుటుంబసభ్యులు ముగ్గురినీ హత్య చేసి అనంతరం ఆత్మహత్య చేసుకున్నట్లుగా పోలీసుల దర్యాఫ్తులో తేలింది. కరెంట్ వైర్ తో గొంతు నులిమి భార్య సింధూర, కుమార్తె ఆద్య, తల్లిని.. ప్రతాప్ చంపేసినట్లు పోలీసులు తేల్చారు.

Tarnaka Family Dead : హైదరాబాద్ తార్నాకలో నలుగురి అనుమానాస్పద మృతి కేసులో కీలక విషయాలు బయటపడ్డాయి. మృతుడు ప్రతాప్ కుటుంబసభ్యులు ముగ్గురినీ హత్య చేసి అనంతరం ఆత్మహత్య చేసుకున్నట్లుగా పోలీసుల దర్యాఫ్తులో తేలింది. కరెంట్ వైర్ తో గొంతు నులిమి భార్య సింధూర, కుమార్తె ఆద్య, తల్లిని.. ప్రతాప్ చంపేసినట్లు పోలీసులు తేల్చారు.
హైదరాబాద్ నుంచి చెన్నైకి కుటుంబాన్ని మార్చాలనే విషయంపై భార్య, భర్తల మధ్య తరుచూ గొడవ జరిగేదని, ఈ కారణంగా ప్రతాప్ ఈ హత్యలు చేసినట్లుగా పోలీసులు భావిస్తున్నారు.
ప్రతాప్ కార్ల షోరూమ్ లో డిజైన్ మేనేజర్ గా పని చేస్తున్నాడు. సింధూర హిమాయత్ నగర్ లోని బ్యాంక్ ఆఫ్ బరోడాలో మేనేజర్ గా పని చేస్తోంది. చెన్నైకి ఫ్యామిలీని షిఫ్ట్ చేయాలనే విషయంపై వారం రోజులుగా ఇద్దరి మధ్య గొడవ జరుగుతోందని, చుట్టుపక్కల వారు చెబుతున్నారు. సింధూర బ్యాంకుకి రాకపోయేసరికి అనుమానం వచ్చిన సహ ఉద్యోగులు ఇంటికి వచ్చి గమనించగా, నలుగురి మృతదేహాలను గుర్తించారు.
తార్నాకలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందడం స్థానికంగా సంచలనం రేపింది. అసలేం జరిగింది? అని అంతా కంగారుపడ్డారు. హత్యలా? ఆత్మహత్యలా? హత్యలే అయితే, ఎవరు చంపారు? ఎందుకు చంపారు? అనేది ఉత్కంఠ రేపింది. చివరికి పోలీసులు మిస్టరీని చేధించారు. అవి మర్డర్స్ అని తేల్చారు.
రూపాలీ అపార్ట్‌మెంట్‌లో నివసించే ప్రతాప్ (34) కుటుంబం అనుమానాస్పద స్థితిలో మృతి చెంది కనిపించింది. మృతుల్లో ప్రతాప్, సింధూర(32), ఆద్య(4), ప్రతాప్ తల్లి ఉన్నారు. ప్రతాప్ చెన్నైలోని ఓ కారు షోరూములో డిజైనర్‌గా పని చేస్తున్నాడు. సింధూర.. హయత్నగర్ లోని ప్రైవేట్ బ్యాంకులో మేనేజర్గా పని చేస్తోంది. ఆదివారం రాత్రి వీరు నలుగురు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. కుటుంబ కలహాలు, ఆర్థిక ఇబ్బందుల కారణంగా కుటుంబం మొత్తం ఆత్యహత్యకు పాల్పడిందని తొలుత అందరూ భావించారు. పోలీసులు కూడా అనుమానాస్పద కేసు నమోదు చేశారు. ఘటనాస్థలిలో దొరికిన ఆనవాళ్లు.. మృతదేహాలను పరిశీలించిన తర్వాత సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
తన కుటుంబాన్ని చెన్నైకి షిప్ట్ చేయాలని ప్రతాప్ అనుకున్నాడు. ఇదే విషయాన్ని భార్య సింధూరకు చెప్పాడు. ఆమె వినకపోవడంతో సింధూరపై ఒత్తిడి పెంచినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ లో జాబ్ చేస్తున్న సింధూర చెన్నైకి వెళ్లేందుకు నిరాకరించింది. చెన్నైకి షిఫ్ట్ కావాలనే విషయంపై దంపతుల మధ్య గొడవ జరిగింది. ఈ ఘర్షణ తీవ్రరూపం దాల్చడంతో ప్రతాప్ దారుణానికి ఒడిగట్టినట్లు పోలీసులు తెలిపారు. భార్య సింధూర, కూతురు ఆద్య, తల్లి రజతిని ప్రతాప్ చంపి.. తాను కూడా ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు.