Boy Made Girl Pregnant : ప్రేమ పేరుతో.. 8వ తరగతి బాలికను గర్భవతిని చేసిన టెన్త్ క్లాస్ బాలుడు

10వ తరగతి బాలుడు 8వ తరగతి బాలికను గర్భవతిని చేయడం కలకలం రేపింది. ఈ ఘటన నారాయణపేట జిల్లా కోస్గి మండలంలో జరిగింది.

Boy Made Girl Pregnant : చక్కగా స్కూల్ కి వెళ్లి బుద్ధిగా చదువుకోవాల్సిన వయసు పిల్లలు.. హద్దు మీరుతున్నారు. కొందరి పిల్లల ప్రవర్తన సభ్య సమాజాన్ని ఆందోళనకు గురి చేస్తోంది. సినిమాల ప్రభావమో, సెల్ ఫోన్ల ప్రభావమో… పిల్లలు పెడదారి పడుతున్నారు. వయసుకి మించిన పనులు చేస్తున్నారు. ఆకర్షణ, ప్రేమ అంటూ పెడదారులు పడుతున్నారు. తాజాగా జరిగిన ఓ ఘటన.. సభ్య సమాజాన్ని షాక్ కి గురి చేసింది. 10వ తరగతి బాలుడు 8వ తరగతి బాలికను గర్భవతిని చేయడం కలకలం రేపింది. ఈ ఘటన నారాయణపేట జిల్లా కోస్గి మండలంలో జరిగింది.

బాలిక తల్లిదండ్రులు ఉపాధి కోసం హైదరాబాద్ లో ఉంటున్నారు. బాలిక తన నానమ్మ వద్ద ఉంటూ స్కూల్ కి వెళ్తోంది. ఈ క్రమంలో ఇంటి ఎదురుగా ఉండే పదవ తరగతి బాలుడి ఆకర్షణలో పడింది. ఇద్దరి మధ్య సానిహిత్యం శారీరక బంధం వరకూ వెళ్లింది. దీంతో ఆ బాలిక గర్భం దాల్చింది. ఇటీవల బాలిక హైదరాబాద్ లోని తల్లిదండ్రుల వద్దకు వెళ్లగా వారు గుర్తించి నిలదీశారు. దీంతో జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు వివరించింది బాలిక.

గ్రామానికి చేరుకున్న తల్లిదండ్రులు బాలికను బాలుడు పెళ్లి చేసుకోవాల్సిందిగా ఊరి పెద్దల వద్ద పంచాయతీ పెట్టారు. అయితే బాలుడి కుటుంబసభ్యులు అందుకు నిరాకరించారు. దీంతో బాలిక తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రస్తుతం బాలిక ఏడు నెలల గర్భవతి. మైనర్ కుర్రాడు చేసిన పనితో స్థానికులు నిర్ఘాంతపోయారు. చక్కగా చదువుకోవాల్సిన పిల్లలు ఇలా తయారయ్యారేంటని తలలు పట్టుకున్నారు.

కొన్నిరోజుల క్రితం తమిళనాడులో ఇలాంటి ఘటనే జరిగింది. 12 ఏళ్ల బాలుడు.. 17 ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఫలితంగా బాలిక ఓ బిడ్డకు జన్మనిచ్చింది. పోలీసులు ఆ బాలుడిని అదుపులోకి తీసుకున్నారు.

పిల్లల విపరీత ప్రవర్తన తల్లిదండ్రులను ఆందోళనకు గురి చేస్తోంది. కౌమార దశలో ఉన్న పిల్లలను తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. శారీరక, మానసిక మార్పులు కారణంగా.. టీనేజ్‌లో వారు దారి తప్పే అవకాశం ఉంటుందని.. అందుకే ఎప్పటికప్పుడు వారి బాగోగులు తెలుసుకుంటూ ఉండాలంటున్నారు. పిల్లలు ఏం చూస్తున్నారు? ఏం చేస్తున్నారు? ఎవరితో తిరుగుతున్నారు? ఇలాంటి విషయాలపై పేరెంట్స్ నిత్యం ఓ కన్నేసి ఉంచాలంటున్నారు. లేదంటే.. తర్వాత ఎంత చింతించినా ప్రయోజనం ఉండదంటున్నారు.

ట్రెండింగ్ వార్తలు