Love Marriage : ప్రేమ పెళ్లికి పెద్దలు అంగీకరించలేదని…ఆ ప్రేమ జంట ఏం చేసిందంటే…
తమ ప్రేమ పెళ్లికి పెద్దలు అంగీకరించలేదని ఆ ప్రేమ జంట తీసుకున్న నిర్ణయం రాజస్ధాన్ రాష్ట్రంలోని జైపూర్ నగరంలో సంచలనం రేపింది. జైపూర్ నగరానికి చెందిన కిషన్, జ్యోతిలు ప్రేమించుకున్నారు....

Lovers
Love Marriage : తమ ప్రేమ పెళ్లికి పెద్దలు అంగీకరించలేదని ఆ ప్రేమ జంట తీసుకున్న నిర్ణయం రాజస్ధాన్ రాష్ట్రంలోని జైపూర్ నగరంలో సంచలనం రేపింది. జైపూర్ నగరానికి చెందిన కిషన్, జ్యోతిలు ప్రేమించుకున్నారు. వారి ప్రేమ పెళ్లి వారి కుుటంబాలు అంగీకరించలేదు. దీంతో కిషన్ తన ప్రియురాలైన జ్యోతిని జైపూర్ లోహామండీ ప్రాంతంలో ఏకాంతంగా కలిశాడు. పెద్దలు నిరాకరించడంతో ప్రియుడు తన ప్రియురాలైన జ్యోతిని గొంతు కోసి చంపాడు.
Also read : Encounter : జమ్మూకశ్మీరులో మళ్లీ భారీ ఎన్‌కౌంటర్..ఇద్దరు సైనికులకు గాయాలు
అనంతరం తాను పదునైన ఆయుధంతో గొంతు కోసుకున్నాడు. రక్తపు మడుగులో ఉన్న ప్రేమ జంటను హర్మడ పోలీసులు గుర్తించారు. జ్యోతి అప్పటికే మృతి చెందిందని, కిషన్ పరిస్థితి విషమంగా ఉండటంతో అతన్ని సవాయ్ మాన్ సింగ్ ఆసుపత్రికి తరలించామని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం కిషన్ చికిత్స పొందుతున్నాడు.
Also read : Malaria Vaccine : మలేరియా పీడిత ప్రాంతాల ప్రజలకు ప్రపంచ ఆరోగ్య సంస్థ గుడ్ న్యూస్
‘‘ప్రేమికులు ఇద్దరూ చాలా కాలంగా ప్రేమలో ఉన్నారని.. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలనుకున్నా.. వారి కుటుంబాలు అంగీకరించలేదని’’ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ హిమ్మత్ సింగ్ చెప్పారు. ఈ కేసును దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వివరించారు.
Also read : Indian whisky : భారతీయ ఇంద్రి విస్కీ వెరీ టేస్ట్ గురూ…ప్రపంచ నంబర్ వన్ అవార్డ్