కేడీ నెంబర్ 1 : అక్కడ దొర.. హైదరాబాద్ లో దొంగ

హైదరాబాద్ : అతడు గ్రామ రైతు సంఘానికి అధ్యక్షుడు. తెల్లటి ఖద్దర్ చొక్కా ధరించి, చేతికి రెండు ఉంగారాలు పెట్టుకుని బుల్లెట్ బైక్ పై తిరుగూతూ గ్రామంలో రాజకీయ నేతగా, పెద్దమనిషిగా అందరితో సత్సంబంధాలు ఉన్నవ్యక్తి. కానీ ఈపెద్ద మనిషి హైదరాబాద్ లో తాళం వేసి ఉన్నఇళ్లలో దొంగతనాలు చేసి పోలీసులకు దొరికిపోయాడు.
కర్ణాటకలోని గుల్బర్గా జిల్లా, బెలూర్గి కి చెందిన కాశీనాధ్ గైక్వాడ్ అఫ్జల్ పూర్ తాలూకా రైతు సంఘానికి అధ్యక్షుడిగా పనిచేస్తున్నాడు. తనకున్న 3 ఎకరాల పొలంలో వ్యవసాయం చేస్తూ గ్రామంలో రాజకీయంగా చురకుగా పాల్గొంటున్నాడు. పైరవీలు చేస్తూ అందరికీ పనిచేసి పెడుతూ పెద్దమనిషిగా కూడాచెలామణి అవుతున్నాడు. రాజకీయాల్లోఉండటం వల్ల విలాసాలకు అలవాటు పడ్డ కాశీనాధ్ పేకాటకు వ్యసన పరుడయ్యాడు. పేకాటలో ఆర్ధిక ఇబ్బందులు తలెత్తడంతో ఉర్లో తన హోదా తగ్గకుండా ఉండటానికి దొంగతనాలు చేయటం ప్రారంభించాడు.
ఇందుకోసం హైదరాబాద్ వచ్చి తాళంవేసి ఉన్న ఇళ్లను ఎంచుకుని వాటిని లూటీ చేయటం మొదలెట్టాడు. 2018 అక్టోబరు నుంచి 2019 జనవరి 22 వరకు సైబరాబాద్, రాచకొండ పోలీసు కమీషనరేట్ల పరిధిలో 16 ఇళ్లల్లో దొంగతానాలు చేసి పోలీసులకు దొరక్కుండా తప్పించుకు తిరుగుతున్నాడు. గుల్బర్గానుంచి హైదరాబాద్ కు బస్సులో వచ్చి, శివారు ప్రాంతాల్లో ఆటోలో తిరుగుతూ, కొన్నిసార్లు నడుచుకుంటూ వెళ్లి తాళం వేసి ఉన్న ఇళ్ళను గమనించేవాడు. అనువుగా ఉన్న ఇళ్ళను ఎంచుకుని అక్కడికి సమీపంలో నిర్మాణంలో ఉన్న ఇళ్ల వద్దకు వెళ్లి అక్కడ ఉండే ఇనుప పరికారాలు తెచ్చుకుని తాళం వేసిఉన్న ఇంట్లో చోరీ చేసేవాడు. అక్కడ చోరీ చేసిన బంగారం వెండి తన గ్రామం తీసుకువెళ్లి కళా సింగ్ అనే అతనికి ఇచ్చి డబ్బులు తీసుకునేనావాడు. ఇలా సైబరాబాద్, రాచొకండ పోలీసుస్టేషన్ల పరిధిలో 16 దొంగ తానాలు చేసి పోలీసులకు దొరక్కుండా తప్పించుకు తిరగసాగాడు. దొంగతనానికి వచ్చేప్పుడు తన వెంట సెల్ ఫోన్ తెచ్చుకునే వాడుకాదు కాశీనాధ్.
16 దొంగతనాలు చేసి పోలీసులకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్న దొంగను పట్టుకోవాలని సైబాబాద్ సీపీ సజ్జనార్ క్రైమ్ డీసీపీ జానకి నేతృ్త్వంలో ఒక బృందాన్ని రంగంలోకి దింపారు. మియాపూర్ రాజేంద్రనగర్,నార్సింగి, ఉప్పల్, బాచుపల్లి పోలీసు స్టేషన్ల పరిధిలో జరిగిన దొంగతనాల సీసీ టీవీ ఫుటేజి పరిశీలించిన పోలీసులు ఆ దొంగతనాలన్నీ కాశీనాధ్ చేసినట్లు గుర్తించారు. గతంలో ఎటువంటి దొంగతనాలు చేయక పోవటం, ఏ పోలీసు స్టేషన్ లోనూ అతనిపై కేసులులేక పోవటంతో అతడ్ని అరెస్టు చేయటం కష్టం అయ్యింది.
దీంతో గైక్వాడ్ ను పట్టుకోటానికి పోలీసులు కర్ణాటక మహారాష్ట్రలకుప్రత్యేక బృందాలను పంపారు. చివరకు గుల్బర్గా పోలీసుల సహకారంతో గైక్వాడ్ ను పట్టుకున్నారు. ట్రన్సిట్ వారంట్ పై గైక్వాడ్ ను గురువారం పోలీసులు సైబరాబాద్ తీసుకు వచ్చారు. అతనివద్దనుంచి 54 తులాల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. కోర్టులో హజరుపరిచి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు.