బీజేపీ మాజీ ఎమ్మెల్యే కిషన్ రెడ్డికి బెదిరింపు ఫోన్ కాల్స్

  • Published By: veegamteam ,Published On : April 24, 2019 / 04:06 PM IST
బీజేపీ మాజీ ఎమ్మెల్యే కిషన్ రెడ్డికి బెదిరింపు ఫోన్ కాల్స్

Updated On : April 24, 2019 / 4:06 PM IST

బీజేపీ అంబర్ పేట మాజీ ఎమ్మెల్యే కిషన్ రెడ్డికి బెదిరింపు ఫోన్ కాల్స్ వచ్చాయి. అంతు చూస్తామని ఓ అగంతకుడు ఫోన్ చేసి ఉర్దూలో బెదిరించారు. గతంలో కూడా ఆయనకు ఇలాంటి బెదిరింపు ఫోన్స్ కాల్స్ వచ్చాయి. కిషన్ రెడ్డికి నిన్న రాత్రి 10 గంటల సమయంలో అంగతుకుడి నుంచి బెదిరింపు ఫోన్ కాల్స్ వచ్చాయి. ఫోన్ కాల్ రీసీవ్ చేసుకున్న కిషన్ రెడ్డిని హత మారుస్తామంటూ ఉర్దూలో బెదిరించినట్లు చెబుతున్నారు. బెదిరింపు కాల్స్ పై ఆయన పీఏ కాచిగూడ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. 

గతంలో కాచిగూడ బర్కత్ పుర కాలనీలో నివాసమున్న కిషన్ రెడ్డి ఇంటి సమీపంలో కొద్ది సంవత్సరాల క్రితం ఐఎస్ఐ తీవ్ర వాదులు రెక్కీ నిర్వహించినట్లుగా వార్తలు వెలువడ్డాయి. ఆ తర్వాత వ్యవహారం సద్దుమణిగింది. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా కొంతమంది వ్యక్తులు బెదిరింపుల కాల్స్ కు పాల్పడ్డారు. గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా కిషన్ రెడ్డికి బెదిరింపు ఫోన్ కాల్స్ వచ్చాయి. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లగా ఆయనకు 2+3 సెక్యూరిటీ పెంచారు. బుల్లెట్ ప్రూఫ్ కారు కేటాయించారు.

ఈ బెదిరింపు కాల్స్ తో బీజేపీ కార్యకర్తలు, కిషన్ రెడ్డి అభిమానులు ఆందోళన వ్యక్తం చేశారు. ఆయన పీఏ ఫిర్యాదు మేరకు పోలీసులు 506 సెక్షన్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఐఎస్ ఐ తీవ్రవాదుల ఫోన్ కాల్సా,  ఎక్కడి నుంచి ఫోన్ కాల్స్ వస్తున్నాయన్నది విచారణలో తేలాల్సివుంది.