priyudi mojulo padi
Extra Marital Affair : పెద్దపల్లి జిల్లా గోదావరిఖని గంగానగర్ ఏరియాలో ఆగస్టు 19న అర్ధరాత్రి దాటిన తర్వాత జరిగిన సింగరేణి కార్మికుడు కొరికొప్పుల రాజేందర్‌ను తుపాకితో దారుణంగా కాల్చి చంపిన కేసులో ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి ఒక తుపాకీ, 9 బుల్లెట్లు, మూడు సెల్ ఫోన్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
గోదావరిఖని గంగానగర్ కు చెందిన సింగరేణి కార్మికుడు కోరికొప్పుల రాజేందర్‌కు కిష్టంపేటకు చెందిన రవళితో వివాహం అయ్యింది. రవళికి ఆమె స్వగ్రామంలోని చిన్ననాటి మిత్రుడు బంధం రాజుతో వివాహేతర సంబంధం ఉండేది.
రాజేందర్ తో వివాహం అయిన ఆరేళ్లలో వారికి ఇద్దరు కొడుకులు పుట్టారు. అయినప్పటికీ రవళి తన చిన్ననాటి మిత్రుడు బంధం రాజుతో వివాహేతర సంబంధం కొనసాగించ సాగింది. రవళి వివాహేతర సంబంధంలో ఉందని తెలుసుకునవ్న రాజేందర్ పలు మార్లు ఆమెను హెచ్చరించాడు. ఈ క్రమంలోనే తమ వివాహేతర బంధానికి అడ్డుగా ఉన్న భర్త రాజేందర్ ను చంపేయాలనే ఉద్దేశంతో పలుమార్లు ప్రియుడితో కలిసి రవళి ప్రయత్నం చేసింది.
చివరకు ఈనెల 19న అర్ధరాత్రి దాటిన తర్వాత ప్రియుడు బంధం రాజుతో పాటు అతని మిత్రుడు సయ్యద్ వచ్చి గంగానగర్ లోని తన ఇంట్లో నిద్రిస్తున్న రాజేందర్ పై తుపాకితో రెండు రౌండ్లు కణతిపై కాల్చి దారుణంగా చంపేశారు. మృతుని తండ్రి మొండయ్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేసి మృతుని భార్య రవళి తో పాటు ఆమె ప్రియుడు రాజు, సయ్యద్ లను ఈరోజు అరెస్టు చేసి రిమాండ్ కు పంపించారు. వీరితో పాటు మరో ముగ్గురు పరారీలో ఉన్నట్లు పెద్దపల్లి డీసీపీ చెన్నూరు డీసీపీ రూపేష్ తెలిపారు.
Also Read : Income Tax Raids : హైదరాబాద్ లో ఆదాయపన్ను శాఖ అధికారులు దాడులు