Black Magic
Black Magic : జగిత్యాల రూరల్ మండలం తారకరామనగర్‌లో భయం నెలకొంది. మంత్రాలు చేస్తున్నారనే నెపంతో నిన్న తండ్రి, అతడి ఇద్దరు కొడుకులను దారుణంగా హత్య చేశారు. దుండగులు గొడ్డళ్లు, కత్తులతో తండ్రి, కొడుకులను అతి కిరాతకంగా నరికి చంపేశారు. దాడిలో తీవ్రంగా గాయపడిన జగన్నాథం నాగేశ్వరరావు, జగన్నాథం రాంబాబు, రమేష్‌లు అక్కడికక్కడే మృతి చెందారు.
మృతుడు నాగేశ్వర్ రావు మంత్రులు చేస్తూ ఇబ్బందులు పెట్టే వాడని స్థానికుల ఆరోపించారు. నాగేశ్వరరావు చెప్పినట్లు వినకపోతే ఇబ్బందులకు గురి చేసే వాడని, మహిళలను శారీరకంగా లొంగదీసుకునేవాడని కాలనీ మహిళలు చెబుతున్నారు. అమావాస్య, పౌర్ణమి నాడు నగ్నంగా తిరుగుతూ భయపెట్టే వాడని తెలిపారు. టీఆర్ నగర్ లో భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.
Crime News: “పుష్ప లాగా ఎదగాలని” హంతకులుగా మారిన మైనర్లు
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాఫ్తు చేపట్టారు. కాగా, కావాలనే తమ వాళ్లను చంపేశారని మృతుల కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. ఇది ప్రీ ప్లాన్డ్ మర్డర్ అంటున్నారు. జగన్నాథం నాగేశ్వరరావు కుల సంఘంలో పెద్దమనిషిగా ఉండటం, కాలనీలో మంచి పలుకుబడి ఉండటంతో జీర్ణించుకోలేక ప్రత్యర్థులు చంపేశారని ఆరోపిస్తున్నారు. కుటుంబసభ్యుల వర్షన్ అలా ఉంటే.. మంత్రాలు చేస్తున్నారనే నెపంతోనే వారిని హత్య చేశారనే స్థానికులు అంటున్నారు. ముగ్గురి మర్డర్ కు మంత్రాలే కారణమా? ఇతర కారణాలు ఏవైనా ఉన్నాయా? అనేది తేల్చే పనిలో పడ్డారు పోలీసులు.
EBC Nestham : మహిళలకు గుడ్‌న్యూస్.. ఒక్కొక్కరి ఖాతాలోకి రూ.15వేలు
అంత్యక్రియల కోసం మృతదేహాలను టీఆర్‌నగర్‌కు తరలించనున్నారు. దీంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. అక్కడ ఎలాంటి గొడవలు జరక్కుండా ముందు జాగ్రత్తగా భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.