Crime News: “పుష్ప లాగా ఎదగాలని” హంతకులుగా మారిన మైనర్లు

"పుష్ప" మూవీ, "బౌకాల్ వెబ్ సిరీస్"లను ప్రేరణగా తీసుకుని తాము కూడా నేర ప్రవృత్తిలోకి వెళ్లి, ఆయా చిత్రాల్లోని హీరోల వలే ఎదగాలని భావించారు ముగ్గురు మైనర్లు

Crime News: “పుష్ప లాగా ఎదగాలని” హంతకులుగా మారిన మైనర్లు

Kids Murder

Crime News: సోషల్ మీడియా వెర్రి, సినిమాల ప్రభావం బాలబాలికల్లో ఎంతలా దుష్ప్రభావం చూపుతుందో తెలిపే ఘటన ఇది. సినిమాలు, వెబ్ సిరీస్ లో చూపించే అసాధారణ దృశ్యాలను ప్రేరణగా తీసుకుని ముగ్గురు మైనర్ బాలలు ఒక యువకుడిని హతమార్చారు. ఈఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటుచేసుకుంది. ఢిల్లీ పోలీసులు తెలిపిన వివరాలు మేరకు ఢిల్లీలోని జహంగీర్‌పురిలో ఓ బస్తీలో నివాసముంటున్న ముగ్గురు బాలలు..సోషల్ మీడియా(ఇన్స్టాగ్రామ్)లో పాపులర్ కావాలని ప్రయత్నిస్తున్నారు. అదే సమయంలో తమను చూసి ఇతరులు భయపడే విధంగా ఏదైనా చేయాలనీ భావించి.. ఒంటరిగా ఉన్న ఒక అమాయక యువకుడిని చితకబాదారు. ఆ దృశ్యాలను వీడియో రికార్డు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయాలనుకున్నారు.

Also read: Fever Survey: తెలంగాణలో ఫీవర్ సర్వే, లక్షణాలు ఉంటే వైద్య కిట్లు అందజేత

తీవ్ర గాయాలతో పడిఉన్న యువకుడిని జహంగీర్‌పురిలోని స్థానికులు సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ యువకుడు మృతి చెందడంతో ఆసుపత్రి వర్గాలు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటన స్థలంలోని సీసీటీవీలను పరిశీలించి ముగ్గురు మైనర్ బాలలను అదుపులోకి తీసుకున్నారు. ఘటనపై విచారించిన పోలీసులు.. ఆ ముగ్గురు చెప్పిన విషయాలు విని విస్మయం వ్యక్తం చేశారు. ఇటీవల వచ్చిన “పుష్ప” మూవీ, “బౌకాల్ వెబ్ సిరీస్”లను ప్రేరణగా తీసుకుని తాము కూడా నేర ప్రవృత్తిలోకి వెళ్లి, ఆయా చిత్రాల్లోని హీరోల వలే ఎదగాలని భావించినట్లు ఆ ముగ్గురు బాలురు పోలీసులకు చెప్పారు.

Also read: Corona Update: దేశంలో 3,47,254 కొత్త కరోనా కేసులు

ఈమేరకు ముగ్గురు బాల నేరస్థులను జువెనైల్ కు తరలించిన పోలీసులు వారి నుంచి సెల్ ఫోన్, చాకు, స్వాధీనం చేసుకున్నారు. నేర ప్రవృత్తిని ఎంచుకోవాలని భావించిన బాలురు తమ గ్యాంగ్ కి “బద్నామ్ గ్యాంగ్”గా పేరు కూడా పెట్టడం గమనార్హం. ఇక ఈవార్త సోషల్ మీడియాలో వైరల్ అవగా, చిన్నారులపై సినిమాలు తీవ్ర దుష్ప్రభావం చూపుతున్నాయని, అటువంటి చిత్రాల నుంచి తల్లిదండ్రులే పిల్లల పట్ల జాగ్రత్త వహించాలని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Also read: Jagtial 3 Murder: జగిత్యాల మూడు హత్యలపై కొనసాగుతున్న విచారణ, పోలీసుల అదుపులో ఆరుగురు