మహిళను స్తంభానికి కట్టేసి కొట్టిన ముగ్గురు వ్యక్తులు
సిద్ధిపేట జిల్లా కొహెడం మండలం పోరెడ్డిపల్లి తండాలో దారుణం చోటు చేసుకుంది. మహిళను స్తంభానికి కట్టేసి ముగ్గురు వ్యక్తులు చితకబాదారు.

సిద్ధిపేట జిల్లా కొహెడం మండలం పోరెడ్డిపల్లి తండాలో దారుణం చోటు చేసుకుంది. మహిళను స్తంభానికి కట్టేసి ముగ్గురు వ్యక్తులు చితకబాదారు.
సిద్ధిపేట జిల్లా కొహెడం మండలం పోరెడ్డిపల్లి తండాలో దారుణం చోటు చేసుకుంది. మహిళను స్తంభానికి కట్టేసి ముగ్గురు వ్యక్తులు చితకబాదారు. పొలానికి వెళ్లే దారి విషయంలో మహిళపై దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. దాడి తరువాత బాధితురాలు డయల్ 100కు ఫోన్ చేసి బాధితురాలు ఫిర్యాదు చేసింది. దీంతో కొహెడ పోలీసులు నలుగురిపై కేసు నమోదు చేశారు.
లక్ష్మీపురం గ్రామానికి చెందిన హంస, స్వరూప, రమ అనే ముగ్గురు మహిళలకు పోరెడ్డి పల్లి తండాలో వ్యవసాయ భూములు ఉన్నాయి. వారి భూములకు వెళ్లే దారి విషయంలో గుగులోత్ జ్యోతితో గొడవ జరిగింది. ఈ విషయాన్ని ఆ మహిళలు తమ భర్తలకు చెప్పడంతో వారు కోపంతో జ్యోతిని ఈడ్చుకుంటూ వచ్చి స్థంబానికి కట్టేసి కొట్టారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఒక మహిళ పట్ల ఇంత దారుణంగా వ్యవహరించడంపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. నిందితులకు కఠిన శిక్ష విధించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
పోరెడ్డిపల్లి తండాలో మహిళలను కొంత మంది వ్యక్తులు స్తంభానికి కట్టేసి దారుణంగా హింసించారు. చెప్పులతో కొడుతూ దుర్భాషలాడారు. పొలానికి వెళ్లే దారి విషయంలో గొడవే దీనికి కారణంగా చెబుతున్నారు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి వచ్చి బాధితురాలిని విడిపించారు. దాడికి పాల్పడిన వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.