నడిరోడ్లపైనే : 24 గంటల్లో చెన్నైలో 3 హత్యలు

చెన్నై నగరం వరుస హత్యలతో వణికిపోతుంది. ఏకంగా 24 గంటల వ్యవధిలో జరిగిన మూడు హత్యలు చెన్నై నగరవాసులను భయబ్రాంతులకు గురిచేస్తున్నాయి. ఎప్పుడు ఏ వార్త వినాల్సి వస్తుందోననే గుండెదడతో జనాలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని కాలం గడుపుతున్నారు.

నడిరోడ్లపైనే : 24 గంటల్లో చెన్నైలో 3 హత్యలు

Updated On : January 22, 2019 / 10:50 AM IST

చెన్నై నగరం వరుస హత్యలతో వణికిపోతుంది. ఏకంగా 24 గంటల వ్యవధిలో జరిగిన మూడు హత్యలు చెన్నై నగరవాసులను భయబ్రాంతులకు గురిచేస్తున్నాయి. ఎప్పుడు ఏ వార్త వినాల్సి వస్తుందోననే గుండెదడతో జనాలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని కాలం గడుపుతున్నారు.

చెన్నై నగరం వరుస హత్యలతో వణికిపోతుంది. 24 గంటల్లో మూడు హత్యలు చెన్నై నగరాన్ని భయబ్రాంతులకు గురి చేస్తున్నాయి. ఎప్పుడు ఏ వార్త వినాల్సి వస్తుందోననే గుండెదడతో చస్తున్నారు. సిటీ నడిబొడ్డున ఉన్న ఆరుంబక్కం ప్రాంతంలో సోమవారం వేటాడి వెంటాడి హత్య చేసిన ఘటనతో ఆ ప్రాంతంలో భయానక వాతావరణం చోటు చేసుకుంది.

మొదటి హత్య:
2019, జనవరి 21వ తేదీ సోమవారం ఉదయం 11.20గంటల సమయంలో కుమరేశన్(37)తో పాటు మరో ఏడుగురు పూనమళ్లే కోర్టుకు హాజరయ్యారు. తిరిగి వెళుతూ ఆరుంబక్కం ప్రాంతంలో ఓ హోటల్ దగ్గర టిఫిన్ చేసేందుకు ఆగారు. ముగ్గురు వ్యక్తులు అక్కడికి సమీపించారు. వారిని చూడగానే భయంతో కుమరేశన్ పరుగుపెట్టాడు. అతనిని వెంటాడి.. నడిరోడ్డుపైనే కాలేజికీ 50మీటర్ల దూరంలో నరికి చంపారు. అక్కడే ఉన్న సీసీ టీవీలో కుమరేశన్ పరుగులు పెట్టింది ఆ ముగ్గురు దాడి చేసి చంపింది రికార్డు అయింది. స్థానికులు సమాచారంతో పోలీసులు విచారణ చేపట్టారు. చనిపోయిన వ్యక్తి రెండు హత్య కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. హంతకులను గాలించి పట్టుకుంటామని వెల్లడించారు. 

రెండో హత్య :
మొగప్పైర్ ప్రాంతంలో యేసురాజన్ అనే వ్యక్తిని గొంతు కోసి హత్య చేశారు. కలెక్టర్ నగర్ ప్రాంతంలో జరిగిన ఈ ఘటనలో నిందితులుగా మృతుని భార్య కల, కూతురు జెన్నిఫర్, మేనల్లుడు ఫ్రాన్సిస్‌లతో పాటు గోపాల్ అనే బంధువును అరెస్టు చేశారు. సంవత్సరం నుంచి యేసురాజన్ అతని భార్యకి దూరంగా ఉంటున్నాడు. అతని కోడలు రూబీ దగ్గరే ఉంటున్నాడు. దీంతో ఆస్తిని ఎక్కడ కోడలి పేరున రాశాస్తాడేమోనని అనుమానంతో ఈ మొగుడినే చంపించింది భార్య. దూరపు బంధువైన గోపాల్‌తో కలిసి వ్యూహం పన్నింది. జనవరి 20వ తేదీ ఆదివారం రాత్రి యేసురాజన్‌ – గోపాల్‌ మధ్య గొడవ జరగటంతో.. ఇదే అదునుగా గొంతుకోసి కిరాతకంగా చంపేశారు.

మూడో హత్య :
ఆటో డ్రైవర్ ఆరుముగం(45) తన బంధువైన దేవరాజ్‌తో ఇంటి ముందే మాట్లాడుతున్నాడు. వీరి మధ్య మంధవ మెట్టూర్‌లోని అవడి ప్రాంతం దగ్గర మోటార్ పంప్ ఫిక్సింగ్ చేస్తుండగా వాదన పెరిగింది. మాటలు చేతల వరకు వెళ్లాయి. ఆరుముగం గుండెలపై తన్నాడు దేవరాజ్. ఆరుముగం ఇంటికి వెళ్లి ఛాతీ నొప్పి అని చెప్పడంతో ఆసుపత్రికి తీసుకువెళ్లారు కుటుంబ సభ్యులు. దారిలోనే మృతి చెందాడు ఆరుముగం. పోలీసులు హత్యానేరం కింద కేసు నమోదు చేసి.. దేవరాజ్‌ను అరెస్టు చేశారు.

జస్ట్ 24 గంటల్లో చెన్నై సిటీలో మూడు హత్యలు సంచలనంగా మారాయి. వరస హత్యల వార్తలతో రోజంతా సిటీవాసులు కంగారు కనిపించారు. ఏ టీవీ పెట్టినా.. తర్వాత రోజు ఏ పేపర్ చూసినా ఈ మూడు హత్యల వార్తలు హైలెట్ కావటంతో కంగారు పడ్డారు. జాగ్రత్తగా ఉండాలనంటూ ఒకరికి ఒకరు సర్దిచెప్పుకున్నారు.