ఘోర రోడ్డు ప్రమాదం : మృతదేహాన్ని 3కిమీ ఈడ్చుకెళ్లిన లారీ
విశాఖ: జిల్లాల్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎస్.రాయవరం మండలం డి అగ్రహారం దగ్గర జాతీయ రహదారిపై బైక్-లారీ ఢీకొన్న ఘటనలో ముగ్గురు యువకులు స్పాట్‌లోనే

విశాఖ: జిల్లాల్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎస్.రాయవరం మండలం డి అగ్రహారం దగ్గర జాతీయ రహదారిపై బైక్-లారీ ఢీకొన్న ఘటనలో ముగ్గురు యువకులు స్పాట్‌లోనే
విశాఖ: జిల్లాల్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎస్.రాయవరం మండలం డి అగ్రహారం దగ్గర జాతీయ రహదారిపై బైక్-లారీ ఢీకొన్న ఘటనలో ముగ్గురు యువకులు స్పాట్‌లోనే చనిపోయారు. 2019, ఫిబ్రవరి 12వ తేదీ మంగళవారం మధ్యాహ్నం ఈ ప్రమాదం జరిగింది. లారీ ఢీకొట్టడంతో బైక్‌పై ఉన్న ముగ్గురు యువకులూ తీవ్రంగా గాయపడి మృతిచెందారు. వీరిని అగ్రహారం గ్రామానికి చెందిన ఆర్.నవీన్(18), కె. వరప్రసాద్ (16), కార్తీక్ (16)లుగా గుర్తించారు. ముగ్గురు యువకులూ ద్విచక్ర వాహనంపై యలమంచిలి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. అగ్రహారం సర్కిల్ దగ్గర రోడ్డు క్రాస్ చేస్తుండగా తుని నుంచి విశాఖ వైపు వెళ్తున్న లారీ వీరి వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. బైక్‌ను లారీ 3 కిలోమీటర్లు ఈడ్చుకెళ్లింది. బైక్‌తో పాటే వరప్రసాద్ మృతదేహం ఉంది. యలమంచిలి మండలం పులపర్తి వద్ద వరప్రసాద్ డెడ్ బాడీ లభ్యమైంది.
ఈ ఘటనపై గ్రామస్థులు ఆందోళనకు దిగారు. నేషనల్ హైవే బైఠాయించి నిరసన తెలిపారు. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని, గ్రామస్థులతో చర్చించి వారికి నచ్చజెప్పి ఆందోళనను విరమింపజేశారు. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ పరారీలో ఉన్నాడు. అతడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.