కోడి పందాల్లో విషాదం : కోడి కత్తి తగిలి వ్యక్తి మృతి

  • Published By: chvmurthy ,Published On : January 15, 2020 / 12:53 PM IST
కోడి పందాల్లో విషాదం : కోడి కత్తి తగిలి వ్యక్తి మృతి

పశ్చిమ గోదావరి జిల్లాలో జరుగుతున్నకోడి పందాల్లో విషాదం చోటు చేసుకుంది. చింతలపూడి మండలం ప్రగడవరంలో కోడి కత్తి తగిలి  ఒక వ్యక్తి మృతి చెందాడు. కోడి కత్తి మర్మాంగాలకు తగలడంతో సరిపల్లి చిన వెంకటేశ్‌ అనే వ్యక్తి మృతి చెందాడు. 

పందెంలో రెండు కోళ్లు పోట్లాడుతుండగా వాటికి ఎదురుగా నిలబడి వెంకటేశ్‌ వాటని చూస్తున్నాడు. కోళ్ళ మధ్య పొట్లాటలో ఒక కోడి గాల్లోకి ఎగిరి అతని మీదకు దూసుకురావడంతో అతనికి తగిలింది.   కోడికి కట్టిన కత్తి  అతని మర్మాంగాలకు తగలడంతో ఘటనా స్థలంలోనే వెంకటేశ్‌ మృతి చెందాడు. 

సాంప్రదాయ  పద్దతిలో కత్తులు కట్టకుండా పందేలు నిర్వహిస్తున్నామని నిర్వాహకులు చెప్పినా  నిబంధనలకు విరుధ్దంగా కోళ్లకు కత్తులు కట్టి పోటీలు నిర్వహిస్తున్నారు. కోళ్లకు కట్టే కత్తి చాలా పదనుగా ఉండటంతో ఘటనా స్ధలంలోనే వెంకటేష్ ప్రాణం వదిలాడు.