TRS leader Tammineni Krishnaiah murdered
TRS leader Tammineni Krishnaiah murder : ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్ నేత తమ్మినేని కృష్ణయ్య దారుణ హత్యకు గురయ్యారు. తెల్దారుపల్లి శివారులో కృష్ణయ్యను దుండగులు దారుణంగా నరికి చంపారు. రాజకీయ కక్షలే హత్యకు కారణమని కుటుంబ సభ్యులు భావిస్తున్నారు. కొన్ని సంవత్సరాల క్రితం కృష్ణయ్య టీఆర్ఎస్‌లో జాయిన్ అయ్యారు. అప్పటి నుంచి తుమ్మల నాగేశ్వరరావు అనుచరుడిగా తమ్మినేని కృష్ణయ్య కొనసాగుతున్నారు. ఇవాళ ఉదయం తమ్మినేని కృష్ణయ్యను ఆయన వ్యక్తిగత సహాయకుడు ముత్తేశ్ బైక్‌పై తీసుకెళ్తుండగా దుండగులు దాడి చేశారు. తెల్దారుపల్లి శివారులో దారుణంగా నరికి చంపారు. రాజకీయ కక్ష్యతోనే కృష్ణయ్యను చంపారని కటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.
తమ్మినేని కృష్ణయ్య హత్యతో ఖమ్మం జిల్లా తెల్దారుపల్లిలో హైటెన్షన్ కొనసాగుతోంది. కృష్ణయ్య హత్యకు సీపీఎం నేతలే కారణమని ఆరోపిస్తూ..అతడి అనుచరులు దాడికి దిగారు. సీపీఎం నేత తమ్మినేని కోటేశ్వరరావు ఇంటిపై కృష్ణయ్య అనుచరుల దాడి చేశారు. కోటేశ్వరరావు ఇంట్లోని ఫర్నీచర్, అద్దాలు ధ్వంసం చేశారు. దీంతో అలర్ట్ అయిన పోలీసులు.. కృష్ణయ్య అనుచరులను చెదరగొట్టారు.
BJP-TRS: బండి సంజయ్ పాదయాత్రలో ఉద్రిక్తత.. బీజేపీ-టీఆర్ఎస్ ఘర్షణ
కృష్ణయ్య కూతురు రజిత కోటేశ్వరరావు ఇంటిపై దుమ్మెత్తి పోశారు. ఇంట్లో నుంచి కోటేశ్వరరావు బయటకు రావాలని రజిత డిమాండ్ చేశారు. దీంతో తెల్దారుపల్లిలో ఉద్రిక్తత కొనసాగుతోంది. ఇటు దారి కాచి దాడి చేసిన దుండగుల పేర్లను కృష్ణయ్య సహాయకుడు ముత్తేశ్ వెల్లడించాడు. బోడపట్ల శ్రీను, గజ్జి కృష్ణసాయి, నూకల లింగయ్య, బండారి నాగేశ్వరరావు…కృష్ణయ్యను హత్య చేశారని ఆరోపించాడు.