Tv Actress Mythili Case
TV Actress Mythili Case : టీవీ సీరియల్ నటి కట్టా మైథిలి ఆత్మహత్యాయత్నం కేసులో పోలీసులపై ఆరోపణలు చేస్తున్నారు మైథిలి కుటుంబసభ్యులు. రెండేళ్ల నుంచి పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నా తమకు న్యాయం జరగటం లేదని, అందుకే మైథిలి ఆత్మహత్యాయత్నం చేసిందని బాధితురాలి కుటుంబసభ్యులు ఆరోపించారు. నిన్న మైథిలి పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కు లైవ్ కాల్ చేసింది. విషం తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. వెంటనే అలర్ట్ అయిన పోలీసులు.. ఆమె లైవ్ లొకేషన్ ట్రేస్ చేసి ఆమె ఇంటికి చేరుకున్నారు. వెంటనే మైథిలిని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం బాధితురాలు నిమ్స్ లో చికిత్స పొందుతోంది.
రెండేళ్ల నుంచి మైథిలికి, ఆమె భర్త శ్రీధర్ రెడ్డికి మధ్య విబేధాలు నడుస్తున్నాయి. ఓ టీవీ చానెల్ లో ప్రొగ్రామ్ డైరెక్టర్ గా పని చేస్తున్న శ్రీధర్ రెడ్డికి.. రూ.13లక్షల నగదు, 65 తులాల బంగారం ఇచ్చి పెళ్లి చేశారు మైథిలి తల్లిదండ్రులు. అయినా అదనపు కట్నం కోసం శ్రీధర్ రెడ్డి వేధించడంతో.. రెండేళ్ల క్రితం సూర్యాపేట జిల్లా మోతే పోలీస్ స్టేషన్ లో భర్త శ్రీధర్ రెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది మైథిలి. తర్వాత సెప్టెంబర్ 2021లో పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లోనూ భర్తపై గృహహింస కింద కేసు పెట్టింది.(TV Actress Mythili Case)
Husband murder Wife: భార్యను హత మార్చిన ‘సాఫ్ట్‌వేర్’ భర్త: తిరుపతిలో దారుణ ఘటన
ఈ కేసులో మైథిలి భర్త శ్రీధర్ మరో నలుగురు నిందితులుగా ఉన్నారు. ఈ కేసులో విచారణ పూర్తైంది. కానీ, వారిని అరెస్ట్ చేయకపోవడంపై మైథిలి ఆగ్రహం వ్యక్తం చేసింది. శ్రీధర్ రెడ్డికి ఆయన తమ్ముడు విజయ్ భాస్కర్ రెడ్డి, వెంకట్ రెడ్డి, మహా అనే ఓ మహిళ సహకరిస్తున్నారని మైథిలి చెప్పింది.
తన భర్త మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని ఆరోపించింది. 8 నెలలుగా పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నా.. పంజాగుట్ట పోలీసులు మాత్రం నిందితులు పరారీలో ఉన్నారని చెబుతున్నారని మైథిలి ఆరోపించింది. పోలీసుల తీరుతో మైథిలి మనస్తాపం చెందింది. ఇక తనకు న్యాయం జరగదేమోననే ఆవేదనతో తీవ్ర నిర్ణయం తీసుకుంది. పంజాగుట్టు పోలీసులకు లైవ్ కాల్ చేసి మరీ ఆత్మహత్యాయత్నం చేసింది.(TV Actress Mythili Case)
TV Actress : టీవీ నటి ఆత్మహత్యాయత్నం.. నిమ్స్‌కి తరలించిన పోలీసులు..
తన భర్త తాను కొనుక్కున్న కారును బలవంతంగా తీసుకున్నాడని మైథిలి ఆరోపించింది. అడిగినా కూడా ఇవ్వడం లేదని భర్తపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు విచారణ చేపడతామన్నారు. అయితే పోలీస్ స్టేషన్ నుంచి ఇంటికి వెళ్లిన ఆమె తనకు న్యాయం జరగలేదంటూ పోలీసులకు వీడియో కాల్ చేసి లైవ్ సూసైడ్ చేసుకుంది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఫోన్ సిగ్నల్స్ ద్వారా ఆమె లొకేషన్ కనుగొని ఆమె ఇంటికి చేరుకున్నారు. అపస్మారక స్థితిలో ఉన్న నటిని నిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి బాగానే ఉందని డాక్టర్లు తెలపడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.