విషాదం : విద్యుత్ షాక్ తో ఇద్దరు రైతులు, లైన్ మెన్ మృతి 

  • Published By: veegamteam ,Published On : January 6, 2019 / 11:01 AM IST
విషాదం : విద్యుత్ షాక్ తో ఇద్దరు రైతులు, లైన్ మెన్ మృతి 

మంచిర్యాల : జిల్లాలో విషాదం నెలకొంది. షార్ట్ సర్య్యూట్ ముగ్గురు ప్రాణాల్ని బలి తీసుకుంది. పోలంలో విద్యుత్ షాక్ తో ఇద్దరు రైతులు, లైన్ మెన్ మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.

 వేమనపల్లి మండలంలో ముల్కలపేటలో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు రైతులు రమణ, సురేందర్, నీల్ వాయికి చెందిన లైన్ మేన్ భీమ్ రావు తెల్లవారుజామున 6.30..7 గంటల సమయంలో పొలానికి నీరు పెట్టేందుకు వెళ్లారు. పొలంలోని మోటార్ కు విద్యుత్ కనెక్షన్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తుండగా మీద ఉన్న 11 కేవీ విద్యుత్ లైన్ షార్ట్ సర్క్యూట్ కావడంతో ఇద్దరు రైతులు రమణ, సురేందర్ తోపాటు లైన్ మేన్ భీమ్ రావు కూడా అక్కడికక్కడే మృతి చెందారు. వీరిని కాపాడటానికి వెళ్లిన కొందరికి గాయాలు అయ్యాయి. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు వారికి చికిత్స అందిస్తున్నారు. మెరుగైన చికిత్స కోసం వారిని హైదరాబాద్ కు తరలించే అవకాశాలున్నాయి. వీరి మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ముల్కలపేట, నీల్ వాయి గ్రామాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి.