Woman molested : చదువు ముసుగులో అక్కా చెల్లెళ్లపై లైంగిక వేధింపులు

ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్న ఇద్దరు అక్కా చెల్లెళ్లకు చదువు చెప్పించే ముసుగులో వారిపై ఓ కీచకుడు లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో చోటు చేసుకుంది.

Woman molested : చదువు ముసుగులో అక్కా చెల్లెళ్లపై లైంగిక వేధింపులు

Two Women Molested, By The Name Of Education Help

Updated On : April 19, 2021 / 6:10 PM IST

Two woman molested, by the name of education help : దిక్కులేని వారికి దేవుడే దిక్కని సామెత తెలుగునాట బాగా ప్రాచుర్యంలో ఉంది. ఏ దిక్కులేనివారికి దేవుడు వేరే వారి ద్వారా సహాయం అందిస్తాడని దీని అర్ధం. చాలామంది మాటను నమ్ముతారు కూడా.

ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్న ఇద్దరు అక్కా చెల్లెళ్లకు చదువు చెప్పించే ముసుగులో వారిపై ఓ కీచకుడు లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో చోటు చేసుకుంది. దేవుడిలా తమకు చదువు చెప్పిస్తున్న వ్యక్తి వికృత రూపం చూసి పోలీసులను ఆశ్రయించారు అక్కా చెల్లెళ్లు.

కాకినాడ రూరల్ పరిధిలోని గ్రామీణ ప్రాంతానికి చెందిన 28,24 ఏళ్ల అక్కా చెల్లెళ్ళు కుటుంబ ఆర్ధిక ఇబ్బందుల కారణంగా కాకినాడ అశోక్ నగర్ లోని మడికి రాజేశ్వర దయాళ్, రెండో భార్య స్వాతి వద్దు ఉంటూ 10 ఏళ్లుగా చదువుకుంటున్నారు.

కొంతకాలంనుంచి రాజేశ్వర్ దయాళ్ ఇద్దరు యువతులను లైంగికంగా వేధించసాగాడు. తననుపెళ్లి చేసుకోమని కోరుతూ వారిని ఇబ్బంది పెట్టసాగాడు. అందుకు అతని రెండో భార్య కూడా మద్దతు ఇస్తూ వారిని వత్తిడి చేయసాగింది. తనమాట వినకపోతే చంపేస్తానని బెదిరించటం మొదలెట్టాడు.

తమకు చదువు చెప్పించి , ఆశ్రయం కల్పించి అండగా ఉంటున్నాడనుకున్న వ్యక్తి వికృత రూపం బయటపడటంతో అక్కా చెల్లెళ్లిద్దరూ తమ స్వగ్రామానికి చేరుకున్నారు. బాధిత యువతుల్లో ఒకరు తిమ్మాపురం పోలీసుస్టేషన్ లో ఫిర్యాదు చేశారు. భార్యాభర్తలపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

కాగా….. ఈ కేసు గురించి తెలుసుకున్న రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ… బాధిత యువతులకు రక్షణ కల్పించి, వేధిస్తున్న రాజేశ్వర్ దయాళ్ పై చర్యలు  తీసుకోవాలని జిల్లా ఎస్పీని ఆదేశించారు.