పెళ్లి చేసుకున్న ఇద్దరమ్మాయిలు.. పెద్దలు మందలించేసరికి

పెళ్లి చేసుకున్న ఇద్దరమ్మాయిలు.. పెద్దలు మందలించేసరికి

Updated On : January 23, 2021 / 5:03 PM IST

Two young women who got married, one young woman committed suicide when the adults objected : ప్రకృతి విరుధ్ధమైన పనులను భారతీయులు అంగీకరించే పరిస్ధితిలో లేరు. ఇద్దరు అమ్మాయిలు, ఇద్దరు అబ్బాయిలు కలిసి జీవించటం, పెళ్ళి చేసుకోవటం వంటి చర్యలను తీవ్రంగా వ్యతిరేకిస్తారు. ప్రజలు వారిని విచిత్రంగా చూస్తారు. సమాచార వ్యవస్ధ ఊపందుకున్న ఈ రోజుల్లో ఇలాంటి వార్తలు ఒకటి అరా వినిపిస్తూనే ఉన్నాయి. తాజాగా ఇలాంటి ఘటన తెలంగాణ లోని రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలంలో చోటు చేసుకుంది.

శంకర్ పల్లి మండలానికి చెందిన 19 ఏళ్ల యువతి డిగ్రీ సెంకడియర్ చదువుతోంది. ఆ యువతి ఇంటర్మీడియేట్ ఖమ్మం జిల్లా పాల్వంచలోని హాస్టల్ లో ఉండి చదువుకుంది. ఆ సమయంలో తన తోటి విద్యార్ధిని అయిన మణుగూరుకు చెందిన మరో యువతితో (24) పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం విడదీయరాని స్నేహం గా మారింది.

ఇద్దరూ ఒకరిని విడిచి మరోకరు ఉండలేనంత గాఢంగా ప్రేమించుకున్నారు. జీవితాంతం కలిసి జీవించాలనుకున్నారు. ఇంట్లో వాళ్లకు చెపితో ఎట్టాగూ ఒప్పుకోరని తెలిసి గతేడాది జనవరిలో ఇంట్లోనుంచి పారి పోయి వికారాబాద్ లోని ఓ గుడిలో పెళ్లి చేసుకున్నారు. అనంతరం ఒక ఇల్లు అద్దెకు తీసుకుని జీవించసాగారు.

తమ పిల్ల కనపడటంలేదని శంకరపల్లి లోని అమ్మాయి తల్లితండ్రులు ఫిర్యాదు చేయటంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ఫ్రారంభించారు. మూడు నెలల తర్వాత వీరిజాడ కనిపెట్టారు. ఇద్దరికీ కౌన్సెలింగ్ ఇచ్చి తల్లి తండ్రులకు అప్పగించారు. అయితే తాము ఇద్దరం దూరమైనప్పటికీ ఇద్దరూ యువతులో రోజు ఫోన్ లో ముచ్చటించుకునేవారు. ఇది తెలుసుకున్న తల్లితండ్రులు అ పద్దతి మార్చుకోవాలని హెచ్చరించారు. అయినా పద్దతి మార్చుకోని యువతులు చాటింగ్ చేసుకుంటూనే ఉన్నారు.

ఈ విషయమై శంకర్ పల్లి మండలానికి చెందిన యువతి ఇంట్లో గత 10 రోజులుగా గొడవ జరగటం మొదలైంది. ఈ క్రమంలో మనస్తాపానికి గురైన యువతి ఇంట్లోనే ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్ధలానికి వచ్చి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.