Uttar Pradesh : నుపుర్ శర్మను చంపాలనుకున్న వ్యక్తి అరెస్ట్

స్వాత్రంత్య దినోత్సవ  వేడుకలకు రెండు రోజుల   ముందు ఒక భారీ ఉగ్రవాద కుట్రను ఉత్తర ప్రదేశ్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ చేధించింది.

Uttar Pradesh :  స్వాత్రంత్య దినోత్సవ  వేడుకలకు రెండు రోజుల   ముందు ఒక భారీ ఉగ్రవాద కుట్రను ఉత్తర ప్రదేశ్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ చేధించింది. బీజేపీ బహిష్కృత నేత, మాజీ అధికార ప్రతినిధి  నుపుర్ శర్మను హత్య చేసే పనిలో ఉన్న మహ్మద్ నదీమ్  అనే వ్యక్తిని ఉత్తర ప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేశారు.

షహరాన్ పూర్ కు చెందిన నిందితుడు నదీమ్ 2018 నుంచి సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ పాకిస్తాన్ కు చెందిన ఉగ్రవాద సంస్ధలు జేషే ఏ మహమ్మద్, తెహ్రీక్ ఎ తాలిబన్ వంటి ఉగ్రవాద సంస్ధలతో సంబంధాలు ఉన్నాయని యూపీ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ అధికారులు తెలిపారు.

మొహమ్మద్ ప్రవక్తపై కించపరిచే వ్యాఖ్యలు చేసి… ఇటీవల వివాదంలో చిక్కుకున్న బీజేపీ మాజీ నేత నుపుర్ శర్మను చంపే బాధ్యతను ఉగ్రవాద సంస్ధలు నదీమ్‌కు అప్పగించాయని  పోలీసులు తెలిపారు. ఉత్తర ప్రదేశ్ లో భారీ విధ్వంసానికి పాకిస్తాన్ కు చెందిన టెర్రరిస్ట్ సంస్ధలతో కలిసి ప్లాన్ చేస్తుండగా నదీమ్ ను ఏటీఎస్ అదుపులోకి తీసుకుంది. విచారణ కొనసాగుతోంది.

Also Read : Telangana Five Police Officers : ఐదుగురు తెలంగాణ‌ పోలీసుల‌కు జాతీయ స్థాయిలో గుర్తింపు

ట్రెండింగ్ వార్తలు