Telangana Five Police Officers : ఐదుగురు తెలంగాణ‌ పోలీసుల‌కు జాతీయ స్థాయిలో గుర్తింపు

తెలంగాణకు చెందిన ఐదుగురు పోలీసుల‌కు జాతీయ స్థాయిలో గుర్తింపు ల‌భించింది. కేంద్ర హోంశాఖ అందజేసే ‘కేంద్ర హోం మంత్రి మెడల్‌ ఫర్‌ ఎక్సలెన్స్‌ ఇన్‌ ఇన్వెస్టిగేషన్‌-2022’ పతకాలకు తెలంగాణ పోలీసు శాఖ నుంచి ఐదుగురు పోలీసు అధికారులు ఎంపికయ్యారు. నేర పరిశోధనలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చినందుకు గాను ఎంపిక చేసినట్లు కేంద్ర హోంశాఖ పేర్కొంది.

Telangana Five Police Officers : ఐదుగురు తెలంగాణ‌ పోలీసుల‌కు జాతీయ స్థాయిలో గుర్తింపు

Telangana Five Police Officers

Telangana Five Police Officers : తెలంగాణకు చెందిన ఐదుగురు పోలీసుల‌కు జాతీయ స్థాయిలో గుర్తింపు ల‌భించింది. కేంద్ర హోంశాఖ అందజేసే ‘కేంద్ర హోం మంత్రి మెడల్‌ ఫర్‌ ఎక్సలెన్స్‌ ఇన్‌ ఇన్వెస్టిగేషన్‌-2022’ పతకాలకు తెలంగాణ పోలీసు శాఖ నుంచి ఐదుగురు పోలీసు అధికారులు ఎంపికయ్యారు. నేర పరిశోధనలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చినందుకు గాను ఎంపిక చేసినట్లు కేంద్ర హోంశాఖ పేర్కొంది.

ఈ పతకాలకు ఎంపికైన వారిలో ప్రస్తుతం ట్రాన్స్‌కో డీఎస్పీగా పని చేస్తున్న పి వెంకట రమణ, ఆసిఫ్‌నగర్‌ ఏసీపీ రుద్రవరం గాండ్ల శివ మారుతి, ఎల్బీనగర్‌ ఇన్‌స్పెక్టర్ బి అంజిరెడ్డి, బాలానగర్‌ డీఎస్పీ ఏ గంగారామ్‌, జహీరాబాద్‌ ఏసీపీ వి రఘు ఉన్నారు.

Constable Exams : తెలంగాణ పోలీసు కానిస్టేబుల్ పరీక్షలు వారం రోజులు వాయిదా

దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కలిపి కేంద్ర హోంశాఖ 151 మంది పోలీసు అధికారులను ఈ అవార్డుకు ఎంపిక చేసింది. కేసుల దర్యాప్తులో ఉత్తమంగా పని చేస్తోన్న పోలీసు సిబ్బందిని ప్రోత్సహించేందుకు కేంద్ర హోంశాఖ 2018 నుంచి ఈ మెడల్స్‌ను అందజేస్తోంది. ఈ ఏడాది తెలంగాణ నుంచి ఐదుగురు పోలీసు అధికారులు ఎంపికయ్యారు.