Constable Exams : తెలంగాణ పోలీసు కానిస్టేబుల్ పరీక్షలు వారం రోజులు వాయిదా

తెలంగాణలో ఈనెల 21 న జరగాల్సిన పోలీసు కానిస్టేబుల్ పరీక్షలు వారంరోజుల పాటు వాయిదా పడ్డాయి. తిరిగి ఆ పరీక్షను 28వ తేదీన నిర్వ‌హించనున్నట్లు తెలంగాణ స్టేట్ లెవ‌ల్ పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు ప్ర‌క‌టించింది.

Constable Exams : తెలంగాణ పోలీసు కానిస్టేబుల్ పరీక్షలు వారం రోజులు వాయిదా
ad

Constable Exams :  తెలంగాణలో ఈనెల 21 న జరగాల్సిన పోలీసు కానిస్టేబుల్ పరీక్షలు వారంరోజుల పాటు వాయిదా పడ్డాయి. తిరిగి ఆ పరీక్షను 28వ తేదీన నిర్వ‌హించనున్నట్లు తెలంగాణ స్టేట్ లెవ‌ల్ పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు ప్ర‌క‌టించింది.

ఈ నెల 18వ తేదీ నుంచి అభ్య‌ర్థులు హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకోవ‌చ్చ‌ని బోర్డు సూచించింది. సాంకేతిక కార‌ణాల‌తోనే పోలీసు కానిస్టేబుల్ పరీక్షలను వారం రోజుల పాటు రీషెడ్యూల్ చేస్తున్న‌ట్లు తెలిపింది. నిన్న రాష్ట్ర వ్యాప్తంగా ఎస్ఐ ప్రిలిమ్స్ నిర్వ‌హించిన సంగ‌తి తెలిసిందే.