×
Ad

Triple Talaq :యూపీలో దారుణం… నిఖా అయిన రెండు గంటలకే ట్రిపుల్ తలాఖ్

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మరో దారుణం జరిగింది. పెళ్లి అయిన రెండు గంటలకే కట్నం కింద కారు ఇవ్వలేదనే కోపంతో నవ వధువుకు ట్రిపుల్ తలాఖ్ ఇచ్చిన ఉదంతం యూపీ రాష్ట్రంలోని ఆగ్రా నగరంలో వెలుగుచూసింది....

  • Published On : July 15, 2023 / 04:56 AM IST

UP man gives triple talaq

Triple Talaq : ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మరో దారుణం జరిగింది. పెళ్లి అయిన రెండు గంటలకే కట్నం కింద కారు ఇవ్వలేదనే కోపంతో నవ వధువుకు ట్రిపుల్ తలాఖ్ ఇచ్చిన ఉదంతం యూపీ రాష్ట్రంలోని ఆగ్రా నగరంలో వెలుగుచూసింది. (Triple Talaq) ఆగ్రా నగరంలోని ఫతేహాబాద్ రోడ్డుపై ఉన్న మ్యారేజ్ హాలులో డాలీ, గౌరీల వివాహం జరిగింది. డాలీ తల్లిదండ్రులు కట్నం కింద ఇతర వస్తువులతో పాటు కారు ఇస్తానని హామి ఇచ్చారు. తనకు కట్నం కింద కారు ఇవ్వలేదని డాలీ వరుడు మొహమ్మద్ ఆసిఫ్ కలత చెందాడు.

Pawan Kalyan : నాకు భయం లేదు… నీలాంటి ఎంతమంది జగన్ లు వచ్చినా ఎదుర్కొంటా : పవన్ కల్యాణ్

డాలీ కుటుంబానికి అక్కడికక్కడే కారు ఇప్పించాలని, లేదంటే రూ.5 లక్షలు ఇవ్వాలని వరుడు డిమాండ్ చేశారు. (Bride 2 hours after Nikah) ఇంత తక్కువ సమయంలో కారు లేదా నగదును ఏర్పాటు చేయలేమని డాలీ కుటుంబం చెప్పినప్పుడు, ఆసిఫ్ తన వధువుకు ట్రిపుల్ తలాఖ్ చెప్పి, తన కుటుంబంతో వివాహ వేదిక నుంచి వెళ్లిపోయాడు. (UP man gives triple talaq)

Avneet Kaur : బికినిలో అవ్నీత్ కౌర్ అందాల ఆరబోత..

కమ్రాన్ వాసీ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఆసిఫ్‌తో పాటు మరో ఆరుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్న ఏడుగురినీ అరెస్టు చేయాలని స్థానికులు డిమాండ్‌ చేశారు. ముస్లిం మహిళల వివాహ చట్టం 2019 ప్రకారం మూడుసార్లు తలాఖ్ ఉచ్చరించడం ద్వారా స్త్రీకి విడాకులు ఇవ్వడం చట్టరీత్యా నేరం. ఈ ఉదంతంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.