Blogger Avijit Roy Murder In Bangladesh..us Announces 5 Million Reward
Blogger avijit roy Murder In Bangladesh..US announces 5 million reward : బంగ్లాదేశ్ దేశంలో జరిగిన ఓ హత్యకు సంబంధించిన దోషుల ఆచూకీ తెలిపినా..అప్పగించినా రూ.5 మిలియన్ డాలర్లు అంటే మన కరెన్సీలో రూ.37 కోట్లు ఇస్తామని ప్రకటించింది అమెరికా ప్రభుత్వం. బంగ్లాదేశ్ లో హత్య జరగటమేంటీ? దానికి అమెరికా రివార్డు ఇవ్వటమేంటీ? ఈ హత్యకు గురైన వ్యక్తికి అమెరికాకు సంబంధమేంటీ? అనే అనుమానాలు కచ్చితంగా వస్తాయి. బంగ్లాదేశ్ లో జరిగిన హత్యకు సంబంధించిన దోషులతో పాటు ఇతర నిందితుల ఆచూకీ తెలిపితే రూ.37 కోట్లు రివార్డు ఇస్తామని అమెరికా విదేశాంగ శాఖ ప్రకటించింది.
Read more : Afghanistan : పొరపాటున ‘8 లక్షల డాలర్లు’ శత్రు దేశానికి బదిలీ చేసిన తాలిబన్లు
అసలు విషయమేమంటే..బంగ్లాదేశ్-అమెరికన్ బ్లాగర్ అయిన అవిజిత్ రాయ్ నాస్తికుడు. బంగ్లాదేశ్ లో జన్మించిన ఆయన అమెరికా పౌరుడయ్యారు. అవిజిత్ మత ఛాందసవాదాన్ని బహిరంగంగా విమర్శించేవారు. సర్వసాధారణంగా ఇటువంటి విమర్శలు చేసేవారిపై విమర్శలు..వివాదాలు ఉంటునే ఉంటాయి. ఈక్రమంలో 2015 ఫిబ్రవరి 26న అవిజిత్ తన భార్య రఫీదా అహ్మద్‌తో కలిసి ఢాకాలోని జరుగుతున్న బుక్ ఫెయిర్ (పుస్తక ప్రదర్శన)కు వెళ్లారు. అలా వెళ్లిన అవిజిత్ తిరిగి వస్తుండగా..బంగ్లా రాజధాని ఢాకాలో అల్‌ఖైదాకు చెందిన ఉగ్రవాదులు అవిజిత్ దంపతులపై దాడికి తెగబడ్డారు.
Read more : Hiv in Omicron : ఒమిక్రాన్ మూలాల్లో HIV..ఆ దేశంలో ప్రతి ఐదుగురిలో ఒకరికి ఎయిడ్స్..
బంగ్లాదేశ్‌లో ఉన్న అల్-ఖైదా-ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ అన్సరుల్లా బంగ్లా టీమ్ ఈ దాడికి బాధ్యత వహించింది. ఈ దాడిలో అవిజిత్ మృతి చెందారు. ఆయన భార్య రఫీదా మాత్రం తీవ్రంగా గాయపడ్డారు. అవిజిత్ దాడి హత్యపై అమెరికా మండిపడింది. ఇది క్రూరమైన ఉగ్రవాద హత్య అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. అవిజిత్ హత్య, ఉగ్రదాడిపై బంగ్లాదేశ్ ప్రత్యేక కోర్టు విచారణ చేపట్టింది. ఈ ఘటనలో ఆరుగురిని దోషులుగా తేల్చింది. వీరిలో ఇద్దరు కుట్రదారులుగా చెప్పబడుతున్న సయ్యద్ జియావుల్ హక్ (మేజర్ జియా), అక్రమ్ హుస్సేన్‌లు ఇప్పటికీ పరారీలోనే ఉన్నారు.
Read more : Pet Dog Name Issue :పెంపుడు కుక్కకు ‘సోను’పేరు..మహిళపై కిరోసిన్ పోసి నిప్పుపెట్టిన పక్కింటి వ్యక్తి
వీరితోపాటు ఈ దాడితో సంబంధం ఉన్న ఇతర నిందితులను పట్టుకోవటానికి యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్టేట్ డిప్లొమాటిక్ సెక్యూరిటీ సర్వీస్.. రివార్డ్స్ ఫర్ జస్టిస్(ఆర్‌ఎఫ్‌జే) కింద తాజాగా ఈ రివార్డు ప్రకటించింది. విదేశాంగ కార్యదర్శి ఆంటోనీ బ్లింకెన్ అవిజిత్ హత్య నిందితుల ఆచూకీ తెలిపితే 5 మిలియన్ డాలర్లు రివార్డు ప్రకటించారు. కాగా అవిజిత్ దంపతులపై దాడి జరిగిన తరువాత బంగ్లాదేశ్‌లో ఉన్న అల్-ఖైదా-ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ అన్సరుల్లా బంగ్లా టీమ్ ఈ దాడికి బాధ్యత వహించింది.దీంతో అది కేవలం దుండగుల దాడి కాదని ఉగ్రవాదుల దాడి అని నిర్ధారింపబడింది. ఈ దాడిని అమెరికా ఓ పిరికిపంద చర్యగా అభివర్ణించింది.