Afghanistan : పొరపాటున ‘8 లక్షల డాలర్లు’ శత్రు దేశానికి బదిలీ చేసిన తాలిబన్లు

మూలిగే నక్కపై తాటికాయ పడినట్లైంది తాలిబన్ల బరిస్థితి.. అసలే పీకల్లోతు కష్టాల్లో ఉన్న తాలిబన్ ప్రభుత్వం.. పొరపాటున తమ ఖజానాలోని డబ్బును శత్రుదేశమైన తజికిస్తాన్‌ను బదిలీ చేసింది

Afghanistan : పొరపాటున ‘8 లక్షల డాలర్లు’ శత్రు దేశానికి బదిలీ చేసిన తాలిబన్లు

Afghanistan

Afghanistan : మూలిగే నక్కపై తాటికాయ పడినట్లైంది తాలిబన్ల బరిస్థితి.. అసలే పీకల్లోతు కష్టాల్లో ఉన్న తాలిబన్ ప్రభుత్వం.. పొరపాటున తమ ఖజానాలోని డబ్బును శత్రుదేశమైన తజికిస్తాన్‌ను బదిలీ చేసింది. మొత్తం 8 లక్షల డాలర్లు (రూ.6 కోట్లు) తజికిస్తాన్ ఖాతాను బదిలీ కావడంతో తలలు పట్టుకుంటున్నారు తాలిబన్లు. ప్రజలకు పెట్టడానికి ఆహారం కూడా లేని దేశానికి ఆరు కోట్లు అంటే చాలా ఎక్కువే అని చెప్పాలి. అయితే నగదు బదిలీ ఐన విషయాన్నీ తజికిస్తాన్ దృష్టికి తీసుకెళ్లారు తాలిబన్లు.. వారు నగదు తిరిగిచ్చేందుకు ఒప్పుకోవడం లేదు. తాలిబన్లను మొదటి నుంచి శత్రువులుగా చూస్తున్న తజికిస్తాన్ ఆ దేశానికి సాయం చేసేందుకు కూడా ముందుకు రాలేదు.

చదవండి : Afghanistan: 210 మందికి పైగా ఖైదీలను విడుదల చేసిన తాలిబాన్లు.. ఆందోళనలో ఆఫ్ఘాన్లు

తాలిబన్ల అరాచకాలు భరించలేక తమ దేశానికి శరణార్థులుగా వచ్చిన అఫ్ఘాన్ పౌరుల కోసం ఈ డబ్బు ఖర్చు చేస్తామని తెలిపారు. వీటితో అఫ్ఘాన్ పిల్లలకు విద్య వైద్యం అందిస్తామని వివరించారు. ఇక ఇదిలా ఉంటే అఫ్ఘాన్ తాలిబన్ల చేతుల్లోకి వెళ్లిన తర్వాత ఆ దేశ పరిస్థితి దారుణంగా తయారైంది. నిత్యావసర సరుకులు దొరక్క ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా భారత ప్రభుత్వం 50 వేల మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాలను సరఫరా చేసింది.

చదవండి : Afghanistan : ఆఫ్ఘన్‌లో దారుణం: కన్న పిల్లల్నే అమ్ముకుంటున్నారు