దారుణం : మొబైల్‌లో మాట్లాడుతూ పిల్లాడిపై కారు ఎక్కించాడు
సెల్ ఫోన్ లో మాట్లాడుతూ డ్రైవింగ్ చేయకూడదని ట్రాఫిక్ పోలీసులు నెత్తీనోరు బాదుకుంటున్నా లాభం లేకుండా పోతోంది. జనాలు చెవికి ఎక్కించుకోవడం లేదు. సెల్ ఫోన్ లో

సెల్ ఫోన్ లో మాట్లాడుతూ డ్రైవింగ్ చేయకూడదని ట్రాఫిక్ పోలీసులు నెత్తీనోరు బాదుకుంటున్నా లాభం లేకుండా పోతోంది. జనాలు చెవికి ఎక్కించుకోవడం లేదు. సెల్ ఫోన్ లో
సెల్ ఫోన్ లో మాట్లాడుతూ డ్రైవింగ్ చేయకూడదని ట్రాఫిక్ పోలీసులు నెత్తీనోరు బాదుకుంటున్నా లాభం లేకుండా పోతోంది. జనాలు చెవికి ఎక్కించుకోవడం లేదు. సెల్ ఫోన్ లో మాట్లాడుతూ డ్రైవింగ్ చేస్తూ ప్రమాదాల బారిన పడుతున్నారు. కొన్ని సమయాల్లో అమాయకులను చంపేస్తున్నారు. ఢిల్లీలో ఇలాంటి దారుణమే జరిగింది. ఓ వ్యక్తి సెల్ ఫోన్ లో మాట్లాడుతూ కారు డ్రైవింగ్ చేశాడు. సెల్ ఫోన్ లో మాట్లాడుతూ ఆ ధ్యాసలో ఉండిపోయిన అతడు.. కారుకి ఎదురుగా వచ్చిన తన మేనల్లుడిని కూడా గుర్తించలేకపోయాడు. మూడేళ్ల ఆ బాబుపై నుంచి కారు ఎక్కించాడు. ఈ ఘటనలో బాబు తీవ్రంగా గాయపడ్డాడు. ఆస్పత్రిలో మృత్యువుతో పోరాటం చేస్తున్నాడు. నార్త్ వెస్ట్ ఢిల్లీలోని భరత్ నగర్ లో ఈ ఘటన జరిగింది. బాలుడి పేరు గులామ్. ఆ వ్యక్తి పేరు మహమ్మద్. కారు మీద నుంచి పోవడంతో బాబు తల, ఛాతి భాగంలో తీవ్ర గాయాలు అయ్యాయి.
సోమవారం (ఏప్రిల్ 21,2019) ఈ దారుణం జరిగింది. యాక్సిడెంట్ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. మూడేళ్ల బాబు గులామ్ ని అతడి మామ కారులో ఎక్కించుకుని ఇంటికి తీసుకొచ్చాడు. ఇంటికి దగ్గర కారు ఆపాడు. ఫ్రంట్ డోర్ ఓపెన్ చేసి బాబుని కిందకు దింపాడు. కారు దిగిన బాబు.. ఇంటి వైపు వెళ్తున్నాడు. కారు ముందు నుంచి నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఇంతలో ఫోన్ రావడంతో గులామ్ మామ మహమ్మద్ ఫోన్ లో మాట్లాడుతున్నాడు. అతడి ధ్యాస అంతా మొబైల్ ఫోన్ పై ఉంది. ఆ ధ్యాసలో అతడు.. తన అల్లుడు కారు దాటుతున్న విషయం కూడా మర్చిపోయాడు. అలానే కారుని ముందుకి పోనిచ్చాడు. ఈ ఘటనలో పిల్లాడు కారు కింద పడి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ యాక్సిడెంట్ వీడియో అందరిని షాక్ కు గురి చేసింది. కంట తడి పెట్టించింది. డ్రైవింగ్ లో ఉన్నప్పుడు సెల్ ఫోన్ లో మాట్లాడటం ఎంత ప్రమాదమో తెలియజెప్పింది.
నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసినందుకు పోలీసులు మహమ్మద్ పై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. ఢిల్లీలో ఇలాంటి దారుణం జరగడం నెల రోజుల్లో ఇది రెండవది. ఓ వ్యక్తి కారు రివర్స్ చేసుకుంటున్న సమయంలో వెనకాల ఉన్న నాలుగేళ్ల బాబు మీద నుంచి కారు పోనిచ్చాడు.