UP woman assassinate gender change
UP woman assassinate gender change : ఉత్తరప్రదేశ్‌లోని షాజహాన్‌బాద్ జిల్లాలో ఓ యువతి తాను అబ్బాయిలా మారిపోవాలని అనుకుంది. దాని కోసం ఒకరు చెప్పిన మాటలు నమ్మింది. మాంత్రికుడు వద్దకెళ్లింది. అతను చెప్పినట్లు చేసింది. ఆ తరువాత ఆమె ప్రాణామే పోయింది. మూఢనమ్మకానికి మరో అమ్మాయి జీవితం బలైపోయింది.
ఉత్తరప్రదేశ్ లోని షాజహాన్‌బాద్ జిల్లాలో ఇద్దరి అమ్మాయి మధ్య పుట్టిన ప్రేమ ఈ హత్యకు దారి తీసింది. ఈ హత్య వెనుక ఓ తల్లి కుట్ర దాగి ఉంది. తన కూతురు కోసం మరో తల్లి కన్నబిడ్డను మాంత్రికుడి కబంధ హస్తాలకు అప్పగించిందో మహిళ. షాజహాన్ జిల్లాలోని ఆర్‌సీ మిషన్ పోలీసు స్టేషన్ పరిధిలో పూనమ్, ప్రీతి అనే ఇద్దరు అమ్మాయి మంచి స్నేహితులుగా ఉండేవారు. వారి స్నేహం కాస్తా ప్రేమగా మారింది. అదికాస్తా ఇంకాస్త పెరిగి స్వలింగ సంపర్కులుగా మారారు. వారిద్దరు అమ్మాయిలు కాబట్టి వీరిద్దరు బాగా క్లోజ్ గా తిరుగుతున్నా వారి కుటుంబ సభ్యులకు ఎటువంటి అనుమానం రాలేదు.
Hyderabad : హైదరాబాద్ పాతబస్తీలో ట్రాన్స్‌జెండర్ల హత్య
ప్రీతికి పెళ్లి సంబంధాలు రావటంతో అబ్బాయి తరపువారు ప్రీతి గురించి ఎంక్వయిరీ చేయటంతో పూనమ్‌తో ఆమెకున్న సంబంధం గురించి బయటపడింది. కూతురుకొచ్చిన సంబంధాలన్నీ క్యాన్సిల్ అవుతుంటంతో విషయం గురించి ఆరా తీయగా అసలు విషయం కాస్తా తెలిసింది ప్రీతీ తల్లికి. దీంతో ఆమె అగ్గిమీద గుగ్గిలమైపోయింది. ఊర్మిళపై పీకల వరకు కోపం వచ్చింది.దీంతో ప్రీతి తల్లి ఊర్మిళ ఓ ప్లాన్ వేసింది ఆమెను వదిలించుకోవటానికి. వారి నివసించే ప్రాంతంలో రామ్ నివాస్ అనే తాంత్రికుడి వద్దకెళ్లింది. విషయం గురించి చెప్పి పూనమ్‌ను చంపితే రూ. 1.5 లక్షలు ఇస్తానని చెప్పింది. దానికి రామ్ నివాస్ అంగీకరించాడు. దీంతో ఊర్మిళ అడ్వాన్స్ గా రూ.5వేలు ఇచ్చింది. మిగతావి పని పూర్తి అయ్యాక ఇస్తానని చెప్పింది. దీనికి ప్రీతిని కూడా ఒప్పించింది.
వారి ప్లాన్ లో భాగంగా ప్రీతీ పూనమ్ కు ఫోన్ చేసింది. మనం ఇలా అమ్మాయిల్లా కలిసి ఉంటే సమాజం అంగీకరించదు కాబట్టి నువ్వు అబ్బాయిగా మారితే పెళ్లి చేసుకోవచ్చని అప్పుడు ఇద్దరం కలిసి జీవించవచ్చని చెప్పింది. ఆ మాటలు పూనమ్ నమ్మింది. నువ్వు అబ్బాయిగా మారటానికి ఓ ప్లాన్ ఉందని.. ఓ మాంత్రికుడు ఉన్నాడు అతను నిన్ను అబ్బాయిలా మార్చేస్తాడు అని చెప్పింది. అలా పూనమ్ ను నమ్మించింది. ఆ మాటలు నమ్మిన పూనమ్ గత ఏప్రిల్ 18న పూనమ్ తన ఇంటి నుంచి వెళ్లిపోయింది. దీంతో పూనమ్ కుటుంబ సభ్యులు ఆందోళన పడ్డారు. ఆమె కోసం వెదికారు కానీ కనిపించలేదు. ఆచూకీ తెలియలేదు. దీంతో పూనమ్ సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఏప్రిల్ 26న మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసుల దర్యాప్తు చేపట్టగా చెట్లపొదల్లో మృతదేహంగా కనిపించటంతో అసలు విషయం బయటపడింది.
Maharashtra : మహా దారుణం .. కూలీలను గొలుసులతో కట్టేసి బావులు తవ్విస్తున్న కాంట్రాక్టర్లు
పూనమ్ కాల్ లిస్టులో ప్రీతి నుంచి ఫోన్ వచ్చిందని గుర్తించారు. ఆ దిశగా దర్యాప్తు చేపట్టారు. దాంట్లో భాగంగా ప్రీతీ, పూనమ్ మధ్య ఉన్న సంబంధం గురించి తెలుసుకున్నారు. ప్రీతి, రామ్ నివాస్ మధ్య జరిగిన సంభాషణను పోలీసులు సేకరించారు. దీంతో రామ్ నివాస్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా..హత్య గురించి చెప్పుకొచ్చాడు. పూనమ్‌ను తానే చంపాపపి దాని వెనుక ఉన్న అసలు విషయం చెప్పాడు.
పూనమ్ ను అబ్బాయిలా మారుస్తానని నమ్మించి నది ఒడ్డుకు తీసుకెళ్లానని..నేలపై పడుకోబెట్టి, కళ్లు మూసుకుంటే అబ్బాయిలా అయ్యేలా మంత్రాలు చదువుతానని తాను కళ్లు తెరవమనేవరకు తెరవద్దని చెప్పానని ఆమె అలాగే కళ్లు మూసుకుని పడుకుంది. అప్పుడు పూనమ్ కళ్లు మూసుకోగానే..కొడవలితో గొంతు నరికేశానని చెప్పాడు. ఆ తరువాత మృతదేహాన్ని చెట్ల పొదల్లో పారేశానని తెలిపాడు.అలా ఈకేసులో ప్రీతి, రామ్ నివాస్‌ను అరెస్టు చేసి జైలుకు తరలించారు. ఈ దారుణం బయటపడేసరికి ప్రీతీ తల్లి ఊర్మిళ పరారైంది. ఆమె ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు.