Cheddi Gang Arrested
Cheddi Gang : విజయవాడలో గత కొద్దిరోజులుగా కలకలం సృష్టించిన చెడ్డీ గ్యాంగ్ దొంగల ముఠాలోని ముగ్గురు సభ్యులను విజయవాడ పోలీసలు అరెస్ట్ చేశారు. నిందితులు గుల్ఫర్ గ్రామం గార్బార్డ్ తాలూకా, దాహూద్ జిల్లా, గుజరాత్ రాష్ట్రమునకు… మరియు ఝుబువా తాలూకా, జిల్లా, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన వారు. వీరు రెండు ముఠాలుగా ఏర్పడి విజయవాడ, గుంటుపల్లి, నిడమానూరు, పోరంకి, గుంటూరు జిల్లా తాడేపల్లిల్లో చోరీలకు యత్నించారు.
విజయవాడ పాలప్రాజెక్ట్, కుంచనపల్లి, పోరంకిలో నిడమానూరు వెళ్లే రోడ్డులోని ఇళ్లలో తాళాలు పగుల కొట్టి బంగారం,వెండి,నగదు దోచుకు వెళ్లిపోయారు. తాడేపల్లి, గుంటుపల్లిలలో చోరీకి యత్నించినప్పటికీ అపార్ట్‌మెంట్ వాసులు అప్రమత్తమవటంతో చోరీ చేయకుండానే అక్కడి నుంచి పారిపోయారు.
Also Read : Datta Jayanthi 2021 : మార్గశిర పౌర్ణమి దత్త జయంతి
నేరం జరిగిన ప్రదేశాల్లోని సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా పోలీసులు దర్యాప్తు జరిపి పై ముఠాలకు చెందిన ముగ్గురిని అరెస్ట్ చేసి విజయవాడ తీసుకు వచ్చారు. వారివద్ద నుంచి రూ.20,000 నగదు..32 గ్రాముల బంగారం..2.5 కేజీల వెండి స్వాధీనం చేసుకున్నారు. ఈ చోరీ కేసులలో మిగిలిన నిందితులను కూడా త్వరలో పట్టుకుంటామని విజయవాడ పోలీసు కమీషనర్ కాంతి రాణా టాటా చెప్పారు.