Annamayya District : బాలికపై అత్యాచారయత్నం.. నిందితుడిని కొట్టి చంపిన గ్రామస్తులు

Assault On Minor Girl : మైనర్ బాలికపై దాష్టికానికి ఒడిగట్టడంతో రాళ్లతో ఉత్తన్నను కొట్టి చంపేశారు. బాలికను మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Assault On Minor Girl (Photo : Google)

Annamayya District : బాలికపై అత్యాచారయత్నం.. నిందితుడిని కొట్టి చంపిన గ్రామస్తులు

Assault On Minor Girl : మైనర్ బాలికపై అత్యాచారయత్నం చేసిన నిందితుడిని గ్రామస్తులు కొట్టి చంపేశారు. ఈ ఘటన అన్నమయ్య జిల్లాలో జరిగింది. గుర్రంకొండ మండలం పసవలవాండ్లపల్లిలో ఉత్తన్న అనే వ్యక్తి సైకోగా మారాడు. బాలికపై అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. బాలిక తలపై రాళ్లతో కొట్టి హింసించి మరీ అత్యాచారయత్నం చేశాడు.

Also Read..Viral Video : మహిళలూ.. బైక్ నడిపేటప్పుడు జాగ్రత్త.. రెప్పపాటులో ఎంత ఘోరం జరిగిందో చూడండి..

ఉత్తన్న చర్యతో గ్రామస్తుల్లో కోపం కట్టలు తెంచుకుంది. ఆగ్రహంతో ఊగిపోయారు. మైనర్ బాలికపై దాష్టికానికి ఒడిగట్టడంతో రాళ్లతో ఉత్తన్నను కొట్టి చంపేశారు. బాలికను మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం బాలికకు చికిత్స కొనసాగుతోంది. రంగంలోకి దిగిన పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. కాగా, మృతుడు ఉత్తన్న గతంలో రెండు కుసుల్లో నిందితుడిగా ఉన్నట్లు తెలుస్తోంది.