పచ్చని సంసారంలో చిచ్చు రేపిన లేడీ కానిస్టేబుల్
ప్రేమించిన భార్యను కాదని రెండేళ్లుగా మహిళా కానిస్టేబుల్‌తో..

బాధ్యతగా ఉండాల్సిన లేడీ కానిస్టేబుల్..బరితెగించింది. రియల్ ఎస్టేట్ వ్యాపారికి వల వేసి.. అతని పచ్చని సంసారంలో చిచ్చుపెట్టింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారి.. లేడీ కానిస్టేబుల్ మోజులో పడి.. భార్యను వదిలి.. కిలేడీతో కలిసి ఉంటున్నాడు. ఈ విషయం తెలిసిన బాధితురాలు… రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని తన భర్త, ఆ లేడీ కానిస్టేబుల్ బండారాన్ని బయటపెట్టింది.
ప్రేమ వివాహం చేసుకుని సంతోషంగా జీవిస్తున్న సంసారంలో ఓ మహిళా కానిస్టేబుల్ నిప్పులు పోసింది. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ దండిగా డబ్బులు సంపాదిస్తున్న పురుషుడిపై కన్నేసి లొంగదీసుకుంది. ఆ లేడీ కానిస్టేబుల్ మాయలో పడిన అతగాడు భార్యకు తెలియకుండా రహస్యంగా కాపురం పెట్టాడు. రెండేళ్లుగా సాగుతున్న రహస్య రాసలీలల బాగోతం తాజాగా బయటపడింది. ఈ ఘటన విజయనగరం జిల్లాలో జరిగింది.
విజయనగరం జిల్లాకు చెందిన రియల్ వ్యాపారి సతీష్.. మహిళా కానిస్టేబుల్‌తో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. ప్రేమించిన భార్యను కాదని రెండేళ్లుగా మహిళా కానిస్టేబుల్‌తో సహజీవనం చేస్తున్నాడు. ఈ క్రమంలోనే పక్కా ప్లాన్ తో వారిద్దరూ ఏకాంతంగా ఉండగా సతీష్ భార్య రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది.
తన కాపురంలో నిప్పులు పోస్తుందంటూ మహిళా కానిస్టేబుల్‌పై ఆగ్రహం వ్యక్తం చేసింది. తన భర్తను ఆ ఇంటినుంచి బయటకు పంపాలంటూ కానిస్టేబుల్ ఇంటి ముందు నిరసనకు దిగింది. ప్రేమించి పెళ్లి చేసుకుంటే సతీష్ నరకం చూపిస్తున్నాడంటూ బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. పోలీసులు రంగప్రవేశం చేసి సతీష్ ను అదుపులోకి తీసుకున్నారు. ముగ్గురినీ విచారించిన తర్వాత తుది నిర్ణయం తీసుకుంటామని పోలీసులు తెలిపారు.
Also Read: ప్రాజెక్టులపై జగన్‌కు అవగాహన లేదు, కాంట్రాక్టర్లకు రూ.18వేల కోట్లు బకాయిలు పెట్టారు- మంత్రి నిమ్మల