Maoist Arrest : మావోయిస్టు దళ కమాండర్ అరెస్ట్-సభ్యులు లొంగుబాటు

మావోయిస్టు పార్టీ దళ కమాండర్ వంతల రామకృష్ణ ను విశాఖ రేంజ్ పోలీసులు నిన్న అరెస్ట్ చేశారు.

Maoist Arrest :  మావోయిస్టు పార్టీ దళ కమాండర్ వంతల రామకృష్ణ ను విశాఖ రేంజ్ పోలీసులు నిన్న అరెస్ట్ చేశారు. అతనితో పాటు మరో 37 మంది మావోయిస్టు దళ సభ్యులు, 23 మంది మిలీషియా సభ్యులు లొంగిపోయారని విశాఖ రేంజ్ డీఐజీ హరికృష్ణ చెప్పారు.

అరెస్ట్ చేసిన వంతల రామకృష్ణ అలియాస్ అశోక్ వద్ద నుంచి 39 లక్షల రూపాయల నగదు, ఒక పిస్టల్, 8 బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. అశోక్ కోరుకొండ పెదబయలు దళకమాండర్ గా ఉన్నాడు. అశోక్ మీద 124 కేసులు ఉన్నాయని డీఐజీ తెలిపారు. అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు హత్యకేసులో అశోక్ నిందితుడుగా ఉన్నాడు.

అల్లూరి జిల్లాలో మావోయిస్టుల ప్రాబల్యం తగ్గిందని… పెద్ద బయలు ఏరియా కమిటీ ప్రాబల్యం తగ్గిందని జిల్లా ఎస్పీ సతీష్ చెప్పారు. పార్టీ సభ్యులు అందరిపై రివార్డు ఉందని.. ప్రభుత్వ పధకాలు వస్తున్నాయని.. లొంగిపోయిన మావోయిస్టులకు మంచి సదుపాయాలు కలిగిస్తున్నామని ఆయన చెప్పారు.

దీంతో గిరిజనుల్లో అంతర్మధనం మొదలై మావోయిస్టులకు సహకరించటం లేదని ఆయన అన్నారు. మావోయిస్టుల విధానాలతో గిరిజనులు విభేదిస్తున్నారని.. చత్తీస్ ఘడ్ నుంచి మావోయిస్టులు రావటం తగ్గిందని ఆయన వివరించారు.

Also Read : Bandi Sanjay: ఎన్నికలు ఉంటేనే కేసీఆర్‌కు పీవీ నరసింహారావు గుర్తుకొస్తారు

ట్రెండింగ్ వార్తలు