Bandi Sanjay: ఎన్నికలు ఉంటేనే కేసీఆర్‌కు పీవీ నరసింహారావు గుర్తుకొస్తారు

తెలంగాణ సీఎం కేసీఆర్ పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శలు చేశారు. పీవీని టీవీ అన్న ముఖ్యమంత్రి కేసీఆర్ పీవీ నర్సింహారావు 101వ జయంతిని పురస్కరించుకొని ఎక్కడికి పోయాడంటూ బండి ప్రశ్నించారు. ఇప్పుడు ఎన్నికలు లేవుకాబట్టి కేసీఆర్ బయటకు రాడంటూ ఎద్దేవా చేశారు.

Bandi Sanjay: ఎన్నికలు ఉంటేనే కేసీఆర్‌కు పీవీ నరసింహారావు గుర్తుకొస్తారు

Bandi Sunjay

Updated On : June 28, 2022 / 1:32 PM IST

Bandi Sanjay: తెలంగాణ సీఎం కేసీఆర్ పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శలు చేశారు. పీవీని టీవీ అన్న ముఖ్యమంత్రి కేసీఆర్ పీవీ నర్సింహారావు 101వ జయంతిని పురస్కరించుకొని ఎక్కడికి పోయాడంటూ బండి ప్రశ్నించారు. ఇప్పుడు ఎన్నికలు లేవుకాబట్టి కేసీఆర్ బయటకు రాడంటూ ఎద్దేవా చేశారు. ఎమ్మెల్సీ, కార్పొరేషన్ ఎన్నికలప్పుడు పీవీని టీవీ అని కేసీఆర్ అన్నాడని, పీవీ నరసింహారావు శతజయంతి ఉత్సవాలు కేసీఆర్ ఎన్ని దేశాల్లో జరిపారని ప్రశ్నించారు. ఇప్పుడు ఎన్నికలు లేవు కాబట్టే పీవీ నరసింహారావు ఘాట్ కు కూడా సీఎం కేసీఆర్ రాలేదని విమర్శించారు.

Bandi Sajay: మోదీ సభకు అడ్డంకులు సృష్టిస్తోన్న కేసీఆర్: బండి సంజయ్

పీవీ నరసింహారావు స్వగ్రామం వంగర్ లో అభివృద్ధి ఏమైంది కేసీఆర్ అంటూ బండి సంజయ్ ప్రశ్నించారు. పీవీ కుటుంబాన్ని రాజకీయాల కోసమే కేసీఆర్ వాడుకున్నాడని, పీవీ కుటుంబ సభ్యులు గుర్తించాలని సూచించారు. గాంధీ యేతర కుటుంబం నుండి పీవీ ప్రధాని అయ్యాడు కాబట్టే కాంగ్రెస్ పార్టీ పీవీని గౌరవించలేదని బండి ఆరోపించారు. ఢిల్లీలో పీవీ ఘాట్ ని కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఏర్పాటు చెయ్యలేదని బండి సంజయ్ ప్రశ్నించారు.

Bndi Sanjay: సికింద్రాబాద్ విధ్వంసం ముమ్మాటికీ సీఎంఓ కుట్రే: బండి సంజయ్

కాంగ్రెస్ పార్టీ పీవీని అవమానించిందని, టీఆర్ఎస్ పార్టీ అవమానిస్తూనే ఉందని సంజయ్ అన్నారు. పీవీ నరసింహారావు ప్రధాని గా వున్నప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చ జరిగిందని, పేద ప్రజల గురించి అనునిత్యం ఆలోచించిన వ్యక్తి పీవీ నరసింహారావు అంటూ సంజయ్ కొనియాడారు.