West Godavari : పశ్చిమ గోదావరిలో పట్టుబడ్డ నగదు బంగారం వ్యాపారులదా ?

పశ్చిమ గోదావరి జిల్లా కృష్ణవరం టోల్ ప్లాజా వద్ద నిన్న పట్టుబడ్డ రూ. 4.76 కోట్ల రూపాయల నగదు కేసులో పోలీసులు బస్సులను సీజ్ చేశారు.  డ్రైవర్లను విచారణ నిమిత్తం ఆదాయ  పన్ను శాఖ

West Godavari :  పశ్చిమ గోదావరి జిల్లా కృష్ణవరం టోల్ ప్లాజా వద్ద నిన్న పట్టుబడ్డ రూ. 4.76 కోట్ల రూపాయల నగదు కేసులో పోలీసులు బస్సులను సీజ్ చేశారు.  డ్రైవర్లను విచారణ నిమిత్తం ఆదాయ  పన్ను శాఖ కార్యాలయానికి తీసుకువెళ్లారు. నగదును పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు ట్రెజరీ కార్యాలయానికి తరలించారు.

ఈ కేసుకు సంబంధించి పెందేళ్ల వెంకటేశ్వర రావు , కాకర్ల సుదర్శన్ , అదేశ్ మోర్ అనే ముగ్గురిని మహారాష్ట్రలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  డ్రైవర్లు ఇచ్చిన సమచారం మేరకు…. విజయవాడ నుంచి టెక్కలి వెళ్లే బస్సుకు రామవరప్పాడు రింగ్ వద్ద రామకృష్ణ. రమేష్, సురేష్ అనే వారు ప్రతి సారి బంగారం ఇచ్చేవారు.
Also Read : Drug Menace : తొలి డ్రగ్స్ మరణం కేసు.. కీలక నిందితుడు లక్ష్మీపతి కోసం గాలింపు..!
వాటిని విశాఖపట్నం , సోంపేట , నరసన్నపేట చెందిన సుమారు 12 మంది బంగారం వర్తకులకి ఇవ్వాలని సూచించేవారని తెలిపారు. దీంతో పోలీసులు 12 మంది పై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు