Drug Menace : తొలి డ్రగ్స్ మరణం కేసు.. కీలక నిందితుడు లక్ష్మీపతి కోసం గాలింపు..!

Drug menace : తొలి డ్రగ్స్‌ మరణానికి సంబంధించిన కేసులో కీలక నిందితుడు లక్ష్మీపతి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. నార్కోటిక్ ఎన్ఫోర్స్‌మెంట్ స్పెషల్ టీం రంగంలోకి దిగింది.

Drug Menace : తొలి డ్రగ్స్ మరణం కేసు.. కీలక నిందితుడు లక్ష్మీపతి కోసం గాలింపు..!

Drug Menace Police Launch Manhunt To Nab Drug Supplier

Drug menace : తొలి డ్రగ్స్‌ మరణానికి సంబంధించిన కేసులో కీలక నిందితుడు  లక్ష్మీపతి కోసం పోలీసులు తీవ్రంగా గాలింపు చర్యలు చేపట్టారు. లక్ష్మీపతి కోసం నార్కోటిక్ ఎన్ఫోర్స్ మెంట్ అధికారుల ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. లక్ష్మీపతికి హైదరాబాద్‌లో భారీ నెట్‌వర్క్ ఉందని గుర్తించారు. ఈ క్రమంలో పారిపోయిన లక్ష్మీపతి గోవా లేదా తణుకులో ఉండొచ్చునని అనుమానం వ్యక్తం చేశారు. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు, ఇంజనీరింగ్ విద్యార్థులే టార్గెట్‌గా లక్ష్మీపతి డ్రగ్స్ దందా చేస్తున్నాడని దర్యాప్తులో తేలింది. స్నాప్‌చాట్, టెలిగ్రామ్‌, ఇన్‌స్టా సోషల్‌మీడియా ఫ్లాట్‌ఫాం ద్వారా సాఫ్ట్‌ వేర్‌ ఉద్యోగులను మోసం చేస్తున్నాడని పోలీసులు నిర్ధారించారు.

గోవా నుంచి హైదరాబాద్‌కు డ్రగ్స్ రవాణా చేస్తున్నట్లు దర్యాప్తులో తేలింది. లీటర్‌ హాష్‌ ఆయిల్‌ను రూ.6 లక్షలకు విక్రయిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. డ్రగ్స్‌ దందాలో లక్ష్మీపతి నెట్‌వర్క్‌లో 100 మందికి పైగా కస్టమర్లు ఉన్నారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ క్రమంలోనే లక్ష్మీపతిని పట్టుకునేందుకు స్పెషల్ టీమ్ గోవా వరకు వెళ్లింది. బీటెక్‌ చదువుతూ మధ్యలోనే ఆపేసిన లక్ష్మీపతిపై ఇప్పటికే పలు పోలీస్ స్టేషన్‌లో కేసులు నమోదయ్యాయి. పోలీసుల నుంచి తప్పించుకునేందుకు లక్ష్మీపతి ఎప్పటికప్పుడు మకాం మారుస్తున్నట్టుగా అనుమానిస్తున్నారు. మొదట గంజాయి నుంచి మొదలుపెట్టిన లక్ష్మీపతి అనంతరం హాష్ ఆయిల్, డ్రగ్స్ విక్రయాలను మొదలుపెటినట్టు పోలీసులు గుర్తించారు. లక్ష్మీపతికీ ఐటీ వింగ్‌లో భారీ నెట్ వర్క్ ఉందని గుర్తించిన పోలీసులు ఇప్పటికే లక్ష్మీపతి కాల్ డేటా సేకరించారు.

Drug Menace Police Launch Manhunt To Nab Drug Supplier (1)

Drug Menace Police Launch Manhunt To Nab Drug Supplier

ఫుడ్ డెలివరీ యాప్స్ ద్వారా మారుపేర్లతో డ్రగ్స్ విక్రయం : 
లక్ష్మీపతి మొబైల్ ఫోన్ సిగ్నల్స్ కాల్ డేటా ఆధారంగా విచారణ చేపట్టారు. నార్కోటిక్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ దర్యాప్తులో పలు అంశాలు ఒక్కొక్కిటిగా వెలుగులోకి వస్తున్నాయి. హష్‌ ఆయిల్‌ని కల్తీ చేసి అమ్ముతున్నట్లు నిర్దారించారు. లక్ష్మీపతి బీటెక్‌ స్టూడెంట్.. పోలీసు అధికారి కొడుకుగా నిర్దారించారు. అరకు నుండి విశాఖ ఏజెన్సీకి చెందిన అనేకమంది గంజాయి సరఫరాదారులతో ఇతడికి పరిచయాలు ఉన్నాయని గుర్తించారు. అలాగే తెలంగాణలోని రాచకొండ హైదరాబాద్ నల్లగొండలోనూ గంజాయి హాష్ ఆయిల్ విక్రయం జరుగుతోందని పోలీసులు గుర్తించారు. అరకులో గంజాయి పెడ్లర్ నగేష్‌ సాయంతో హష్‌ ఆయిల్‌ దందా చేస్తున్నట్టు దర్యాప్తులో తేలింది.

అంతేకాదు.. మీర్పేట్ బీరంగూడకు చెందిన మోహన్‌రెడ్డి లక్ష్మీపతికి ప్రధాన అనుచరుడుగా గుర్తించారు. జూబ్లీహిల్స్, మియాపూర్, మాదాపూర్, భువనగిరి, విశాఖపట్నాల్లో ఇళ్లు అద్దెకు తీసుకునీ దందాలు కొనసాగిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. అరకు విశాఖ మీదుగా లీటర్ల కొద్దీ హష్ ఆయిల్ సరఫరా చేయడమే కాకుండా ఆన్‌లైన్‌లోనూ అమ్మకాలు చేపడుతున్నట్టు తేలింది. ఆన్‌లైన్‌లో ఆహారం, కిరాణా సరుకులు విక్రయించే డుంజో, పోర్టర్, ఉబెర్, స్విగ్గీ వంటి యాప్స్‌ ద్వారా మారు పేర్లతో హష్‌ ఆయిల్‌ విక్రయం చేస్తున్నారని పోలీసులు విచారణలో గుర్తించారు. లక్ష్మిపతినీ గతంలో 2020 నవంబర్‌ 27న మల్కాజ్‌గిరి (ఎస్వోటీ) పోలీసులు అరెస్టు చేశారు. లక్ష్మీపతికి చెందిన పూర్తి వివరాలు, అతని ఇన్ఫార్మర్ల కు చెందిన వివరాలు కొన్ని ఆధారాలను పోలీసులు సేకరించారు.

Read Also : Hyd Drugs Case: హైదరాబాద్ డ్రగ్స్ కేసు నిందితుడు.. పోలీస్ అధికారి కొడుకు..?