కారు ప్రమాదానికి ముందు అసలేం జరిగింది, లాస్య నందిత ఏం చేశారు.. 3 గంటలు అక్కడే ఎందుకున్నారు?

రాత్రి 12 గంటల నుంచి తెల్లవారుజామున 3 గంటల వరకు వారంతా అక్కడే ఉన్నారు. ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయారని ఆమె తెలిపారు.

MLA Lasya Nanditha Car Incident : కారు ప్రమాదంలో మృతి చెందిన కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత.. అంతకుముందు దర్గాలో పూజలు నిర్వహించారు. సంగారెడ్డి జిల్లా కోనాపూర్ సమీపంలో ఉన్న దర్గాలో తన అక్క, ఇతర కుటుంబసభ్యులతో కలిసి పూజలో పాల్గొన్నారు.

రాత్రి 12 గంటల నుంచి తెల్లవారుజామున 3 గంటల వరకు దర్గాలోనే వారంతా ఉన్నారు. ఆ తర్వాత వెళ్లిపోయారని దర్గా నిర్వాహకురాలు తెలిపారు. లాస్య నందిత ఎమ్మెల్యే అని కూడా తమకు తెలియదని, తన ఆరోగ్యం సరిగా ఉండకపోవడంతో నమ్మకంతో దర్గాకు వచ్చారని ఆమె చెప్పారు.

బీఆర్ఎస్ నేత, కంటోన్మెంట్ యువ ఎమ్మెల్యే లాస్య నందిత కారు ప్రమాదంలో మరణించిన సంగతి తెలిసిందే. పటాన్ చెరు దగ్గర ఔటర్ రింగ్ రోడ్డుపై జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. కాగా.. కారు ప్రమాదానికి ముందు లాస్య నందిత ఓ దర్గాకు వెళ్లారు. హజ్రత్ సూఫీ సయ్యద్ అబ్దుల్ జఫార్ అలీ దర్గాకు వచ్చారు. ప్రత్యేక పూజలు చేశారు. ఆరోగ్యం బాగోలేకపోవడంతో దర్గాను దర్శించుకుని పూజలు చేస్తే ఆరోగ్యం బాగవుతుందని కొందరు చెప్పడంతో.. లాస్య నందిత దర్గాకు వెళ్లారని తెలుస్తోంది. ఆరోగ్యం బాగోలేకపోవడంతో దర్గాకు వచ్చినట్లు ఎమ్మెల్యే నందిత తనతో చెప్పారని దర్గా నిర్వాహాకురాలు వెల్లడించారు. రాత్రి 12 గంటల ప్రాంతంలో నందిత దర్గాకు వద్దకు వచ్చారు.

Also Read : లాస్య నందితను వెంటాడిన వరుస ప్రమాదాలు.. తండ్రి చనిపోయిన ఫిబ్రవరి నెలలోనే కూతురూ మృతి

”ముందు లాస్య నందిత అక్క వాళ్లు వచ్చారు. లాస్య నందిత 12 గంటలకు వచ్చింది. పూజలు చేసుకున్నారు. మొక్కుకున్నారు. కొంచెం సేపు కూర్చున్నారు. తెల్లవారుజామున 3, 4 గంటలకు వెళ్లిపోయారు. లాస్య నందిత దర్గాకు రావడం ఇదే తొలిసారి. లాస్య నందిత అక్క వాళ్లు రెండుసార్లు వచ్చారు. ఆమె పేరు ఏంటో నాకు తెలీదు. ఆరోగ్యం బాగోలేదని చెప్పారు. పోలీసులు ఇక్కడికి వచ్చారు. ఫోటోలు తీసుకున్నారు. పోలీసులు వచ్చే వరకు నాకు ఏం జరిగిందో తెలీదు. ఎందుకు ఫోటోలు తీసుకుంటున్నారు అని అడిగితే.. రోడ్డు పై ఎన్ని దర్గాలు ఉన్నాయో అన్ని దర్గాల ఫోటోలు తీసుకుంటున్నామని పోలీసులు నాతో చెప్పారు. మాకు ఏమైనా ఇబ్బంది అవుతుందా? సర్ అని అడిగాను నేను. మీకేమీ ఇబ్బంది కాదమ్మా అని పోలీసులు చెప్పారు. లాస్య నందిత మంచి మనిషి” అని దర్గా నిర్వాహకురాలు తెలిపారు.

కారు ప్రమాదానికి ముందు.. అసలేం జరిగింది?
* రాత్రి 1.30 కు ఇంటి నుండి బయల్దేరిన లాస్య కుటుంబసభ్యులు
* సదాశివ పేట్ లో ఒక దర్గాలో ప్రార్థనల కోసం వెళ్ళిన లాస్య కుటుంబ సభ్యులు
* అక్కడి నుండి మూసాపేట్ కు వెళ్లి అక్క కూతురు శ్లోకకు పరీక్షలు ఉండంటతో మూసాపేట్ లో ఉండిపోయిన కుటుంబ సభ్యులు
* ఆకలి కావడంతో బోయిన్ పల్లి నుండి దాబా కోసం మళ్లీ సదాశివపేట్ వెళ్ళిన లాస్య, ఆకాష్
* ఫ్రంట్ సీట్ లోనే కూర్చున్న లాస్య
* డ్రైవర్ నిద్ర మత్తులోనే చోటు చేసుకున్న ప్రమాదం
* ప్రమాదం సమయంలో 100 స్పీడ్ లో ఉన్న కార్

* దర్గా పేరు మీస్కిన్ బాబా దర్గా
* సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం ఆరుర్ నుండి కోనాపూర్ వెళ్లే మార్గమధ్యలో ఉన్న దర్గా
* ఈ దర్గాకు నిన్న అర్ధరాత్రి 12.30 గంటలకు వెళ్లిన ఎమ్మెల్యే లాస్య నందిత.
* దర్గాలో పూజలు చేసిన లాస్య
* తర్వాత ఉదయం 3 నుంచి 4 మధ్యలో వెళ్లిందని చెబుతున్న స్థానికులు.

Also Read : లాస్య నందిత పోస్ట్‌మార్టం నివేదిక.. తలకు బలమైన గాయంతో పాటు..

 

ట్రెండింగ్ వార్తలు