×
Ad

Acid Attack On Boy Friend : సీన్ రివర్స్.. అందుకు ఒప్పుకోలేదని, ప్రియుడిపై యాసిడ్ దాడి

ప్రేమకు ఒప్పుకోలేదనో, పెళ్లికి నో చెప్పిందనో అమ్మాయిలపై యాసిడ్ దాడులు జరిగిన ఘటనలు ఎన్నో. ప్రేమోన్మాదుల దాడిలో ఎంతోమంది అమ్మాయిలు ప్రాణాలు కూడా వదిలారు. కానీ, ఈ మధ్య కాలంలో సీన్..

  • Published On : December 5, 2021 / 12:14 AM IST

Acid Attack

Acid Attack On Boy Friend : ప్రేమకు ఒప్పుకోలేదనో, పెళ్లికి నో చెప్పిందనో అమ్మాయిలపై యాసిడ్ దాడులు జరిగిన ఘటనలు ఎన్నో. ప్రేమోన్మాదుల దాడిలో ఎంతోమంది అమ్మాయిలు ప్రాణాలు కూడా వదిలారు. కానీ, ఈ మధ్య కాలంలో సీన్ రివర్స్ అయ్యింది. యువకులపైనా యాసిడ్ దాడులు జరుగుతున్నాయి. తనను వదిలివేస్తున్నాడని కేరళలో ఓ యువతి.. యువకుడిపై యాసిడ్ దాడి చేసిన ఘటన మరవక ముందే.. ఇలాంటి ఘటనే తమిళనాడు రాష్ట్రం కోయంబత్తూర్ లో చోటు చేసుకుంది. సహ జీవననానికి నో చెప్పాడని ప్రియుడిపై యువతి యాసిడ్ దాడి చేసింది.

Komaki Ranger : కొత్త ఎలక్ట్రిక్ బైక్.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 250 కిలోమీటర్లు

కోయంబత్తూరుకు చెందిన జయంతి(27), కేరళకు చెందిన రాకేష్(30) కొన్ని నెలలుగా సహజీవనం చేస్తున్నారు. ఇటీవల కేరళలో సొంతూరుకు వెళ్లిన రాకేష్ తిరిగి వచ్చిన తర్వాత జయంతితో సంబంధాన్ని తెంచుకునేందుకు ప్రయత్నించాడు. తనకు పెళ్లైందని, ఇకపై సహజీవనం కుదరదని తేల్చి చెప్పాడు. దీంతో జయంతికి తీవ్రమైన కోపం వచ్చింది. రాకేశ్ దూరం కావడాన్ని తట్టుకోలేకపోయింది. రాకేష్ పై యాసిడ్ తో దాడి చేసింది. ఆ తర్వాత భయంతో తాను కూడా నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు ప్రయత్నించింది. ఇద్దరినీ పోలీసులు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇద్దరిపైనా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాఫ్తు చేపట్టారు.