Komaki Ranger : కొత్త ఎలక్ట్రిక్ బైక్.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 250 కిలోమీటర్లు

ఫ్యూయల్ ధర పెరుగుదల సామాన్య ప్రజలకు గుదిబండలా మారింది. దీంతో చాలా వరకు ఎలక్ట్రిక్ వాహనాలను తీసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.

Komaki Ranger : కొత్త ఎలక్ట్రిక్ బైక్.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 250 కిలోమీటర్లు

Komaki Ranger

Komaki Ranger : ఫ్యూయల్ ధర పెరుగుదల సామాన్య ప్రజలకు గుదిబండలా మారింది. దీంతో చాలావరకు ఎలక్ట్రిక్ వాహనాలను తీసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. రోజు రోజుకు ఎలక్ట్రిక్ వాహనాలు కొనేవారి సంఖ్య పెరిగిపోతుంది. డిమాండ్ కి తగినట్లుగా మార్కెట్లోకి కొత్త మోడల్స్ వస్తున్నాయి.

చదవండి : Electric Folding Bike : మడతబెట్టే మినీ ఎలక్ట్రిక్ బైక్ వచ్చేసిందోచ్.. టేబుల్ కింద చుట్టేయొచ్చు!

ఇక ఇప్పటివరకు భారత్‌లో ఎలక్ట్రిక్‌ స్కూటర్లే ఎక్కువగా వాహనదారులకు అందుబాటులో ఉన్నాయి. స్కూటర్లే కాకుండా ఇతర బైక్‌ మోడల్స్‌పై కూడా పలు కంపెనీలు దృష్టిసారిస్తున్నాయి. భారత్‌లో తొలి ఎలక్ట్రిక్‌ క్రూజర్‌ బైక్‌ను కొమాకి త్వరలో విడుదల చేయబోతోంది.

చదవండి : Electric Aircraft: గంటకు 623కిలోమీటర్ల వేగంతో ఎలక్ట్రిక్ రోల్స్-రాయ్స్ ఎయిర్‌క్రాఫ్ట్

ఈ క్రూయిజర్‌కు కొమాకి రేంజర్ అని పేరు పెట్టనున్నారు. దీనికి ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 250 కిమీల వరకు వెళ్తుంది. ఇది భారతదేశపు మొట్టమొదటి ఎలక్ట్రిక్ క్రూయిజర్ బైక్. వచ్చే ఏడాది జనవరిలో కంపెనీ కొమాకి రేంజర్‌ను విడుదల చేస్తే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక కంపెనీ వెబ్‌సైట్‌లో బైక్ ఫోటోలను ఉంచారు

చదవండి : Electric Scooters : భారత్‌లో మధ్యతరగతి ప్రజలు ఎలక్ట్రిక్ స్కూటర్ల వైపు ఎందుకు మొగ్గుచూపుతున్నారు

కొమాకి రేంజర్‌ క్రూజర్ బైక్‌లో ముఖ్యమైన ఫీచర్లుగా క్రూయిజ్ కంట్రోల్, రిపేర్ స్విచ్, రివర్స్ స్విచ్, బ్లూటూత్ సిస్టమ్ , అధునాతన బ్రేకింగ్ సిస్టమ్‌తో రానుంది. కొమాకి రేంజర్‌లో 4-కిలోవాట్ బ్యాటరీ ప్యాక్‌తో రానుంది. దీంతో 250 కిమీల మేర రేంజ్‌ను అందిస్తోందని కంపెనీ చెప్తుతోంది. 5000-వాట్ల మోటారుతో పనిచేయనుంది.

ఇక దీని ధర విషయానికి వస్తే.. కంపెనీ దీని ధర విషయం చెప్పనప్పటికీ.. ఇది సామాన్య ప్రజలకు అందుబాటులోనే ఉంటుందని తెలుస్తుంది. బైక్ ధర లక్ష వరకు ఉంటుందని సమాచారం.