Electric Aircraft: గంటకు 623కిలోమీటర్ల వేగంతో ఎలక్ట్రిక్ రోల్స్-రాయ్స్ ఎయిర్‌క్రాఫ్ట్

బ్రిటీష్ ఏరో ఇంజిన్ మ్యాన్యుఫ్యాక్చర్ రోల్స్-రాయ్స్ తయారుచేసిన ఎలక్ట్రిక్ ఎయిర్‌క్రాఫ్ట్ గంటకు 623వేగంతో ప్రయాణిస్తుందట. స్పిరిట్ ఆఫ్ ఇన్నోవేషన్ పేరిట దీనిని రూపొందించిన యాజమాన్యం.

Electric Aircraft: గంటకు 623కిలోమీటర్ల వేగంతో ఎలక్ట్రిక్ రోల్స్-రాయ్స్ ఎయిర్‌క్రాఫ్ట్

Aircraft

Electric Aircraft: బ్రిటీష్ ఏరో ఇంజిన్ మ్యాన్యుఫ్యాక్చర్ రోల్స్-రాయ్స్ తయారుచేసిన ఎలక్ట్రిక్ ఎయిర్‌క్రాఫ్ట్ గంటకు 623వేగంతో ప్రయాణిస్తుందట. స్పిరిట్ ఆఫ్ ఇన్నోవేషన్ పేరిట దీనిని రూపొందించిన యాజమాన్యం ప్రపంచంలోనే అత్యధిక వేగంతో ప్రయాణించే వాహనం ఇదేనని నమ్ముతున్నారు. కంపెనీ నిర్వహించిన టెస్టులో నిమిషానికి 3వేల మీటర్లు దాటేసిన వెహికల్ గా నిలిచింది.

గతంలో ఉన్న యూకే మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ మిలటరీ ఎయిర్‌క్రాఫ్ట్ గంటకు 182మీటర్ల వేగంతో ప్రయాణిస్తే.. ఇది మాత్రం గంటకు 300మీటర్ల వేగంతో ప్రయాణిస్తుందని తేలింది. స్పోర్ట్స్ గ్లోబల్ గవర్నింగ్ బాడీ ఫెడరేషన్ ఏరోనాటిఖ్ ఇంటర్నేషనల్ ఈ గణాంకాలను ధ్రువీకరించింది.

యాక్సిలరేటింగ్ ద ఎలక్ట్రిఫికేషన్ ఆఫ్ ఫ్లైట్ (ACCEL)ప్రాజెక్టులో భాగంగా ఇది సిద్ధమైంది. ఏరోస్పేస్ టెక్నాలజీ ఇన్‌స్టిట్యూట్ (ATI) , ఎనర్జీ & ఇండస్ట్రియల్ స్ట్రాటజీ అండ్ ఇన్వోవేట్ యూకేకు చెందిన బిజినెస్ డిపార్ట్‌మెంట్‌లు దీనికి స్పాన్సర్ చేశాయట. అయితే 400కిలోవాట్ల సామర్థ్యంతో ఇది ప్రయాణిస్తుందని అధికారికంగా తెలిపారు.

 

……………………………………………… : రంగారెడ్డి జిల్లాలో నాలుగేళ్ల బాలుడు కిడ్నాప్, హత్య