Woman held Thief : ధైర్యంగా దొంగను పట్టుకుని దేహశుధ్ది చేయించిన మహిళ

కిరాణా షాప్ నిర్వహించే ఓ మహిళ కళ్ళల్లో కారం చల్లి ఆమె మెడలోని మంగళసూత్రాన్ని అపహరించుకుని వెళ్లే ప్రయత్నం చేసిన యువకుడిని... అక్కడికి వచ్చిన మరో మహిళ ధైర్యం చేసి అతడిని అడ్డుకోవడంత

Woman Held Thief

Woman held Thief : మహిళ అబల కాదు సబల అని నిరూపించింది కామారెడ్డిలో ఒక మహిళ.  కిరాణా షాప్ నిర్వహించే ఓ మహిళ కళ్ళల్లో కారం చల్లి దొంగతనం చేయటానికి యత్నించిన యువకుడిని అడ్డుకుని స్ధానికులతో దేహశుధ్ది చేయించింది. కామారెడ్డి పట్టణంలోని శివాజీ రోడ్డు చౌరస్తాలో ఏటీఎం వద్ద కృష్ణమూర్తి అనే వ్యక్తి కిరాణా షాప్ నిర్వహిస్తున్నాడు. శుక్రవారం ఉదయం ఏడు గంటల సమయంలో అతని భార్య కిరాణా షాప్ తెరుస్తుండగా అప్పుడే అక్కడికి ఓ గుర్తు తెలియని వ్యక్తి హెల్మెట్ పెట్టుకుని బైక్‌పై వచ్చాడు.

జేబులో చేతులు పెట్టి డబ్బులు ఇస్తున్నట్టు నటించి  షాపులో వస్తువులు కావాలని అడిగాడు. దాంతో ఆమె వస్తువులు ఇస్తుండగానే తన జేబులో నుంచి కారం పొడి తీసి ఆ మహిళ కళ్ళల్లో చల్లాడు. ఆలస్యం చేయకుండా  వెంటనే ఆమె మెడలోని మంగళ సూత్రాన్ని లాక్కొని  బైకుపై పారిపోయే ప్రయత్నం చేశాడు. అప్పటికే కళ్ళల్లో కారం పడటంతో బాధతో మహిళ అరవసాగింది.

ఆదే సమయంలో సరుకుల కోసం కిరాణా షాపుకు వచ్చిన భారతి అనే మరో మహిళ ఆ దొంగను అడ్డుకొని  అతని జేబులోని కారం తీసి అతని కళ్ళల్లోనే  కొట్టి కేకలు వేయడంతో  స్థానికులు అక్కడికి చేరుకున్నారు. ఆ దొంగను పట్టుకుని బట్టలు విప్పించి ఒంటికి కారం చల్లి దేహశుద్ధి చేసారు.

Also Read : Teenmar mallanna : తీన్మార్ మల్లన్నపై బంజారా‌హిల్స్ పోలీసు‌స్టేషన్‌లో ఫిర్యాదు

దొంగిలించిన మంగళసూత్రాన్ని బాధిత మహిళకు అప్పగించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న వార్డు కౌన్సిలర్లు స్ధానికులకు నచ్చచెప్పి నిందితుడిపై దాడిని ఆపారు. పోలీసులకు సమాచారం అందించి సదరు వ్యక్తిని పోలీసులకు అప్పగించారు. ధైర్యంగా దొంగను అడ్డుకొని పట్టించిన భారతి అనే మహిళను స్థానికులు అభినందించారు.