Teenmar mallanna : తీన్మార్ మల్లన్నపై బంజారాహిల్స్ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు
పత్రికా స్వేఛ్చను దుర్వినియోగం చేస్తున్నాడనే ఆరోపణతో చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్నపై చర్యలు తీసుకోవాలని టీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా పోలీసులకు ఫిర్యాదు చేసింది.

TRS vs Teenmar Mallanna
Teenmar mallanna : పత్రికా స్వేఛ్చను దుర్వినియోగం చేస్తున్నాడనే ఆరోపణతో చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్నపై చర్యలు తీసుకోవాలని టీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా పోలీసులకు ఫిర్యాదు చేసింది. పురపాలక, ఐటీ శాఖ మంత్రి, టీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పై సోషల్ మీడియా లో అసభ్యకరంగా వ్యాఖ్యలు చేసిన నవీన్ పై చర్యలు తీసుకోవాలని టీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ బీ.దినేష్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కోన్నారు.
Also Read :Vijayawada Indrakeeladri : ఇంద్రకీలాద్రిపై సీజేఐ దంపతులు…దుర్గమ్మ దర్శనం
ప్రజాస్వామ్యంలో పత్రిక స్వేచ్ఛ ఉందంటూ ఇష్టం వచ్చినట్లు తీన్మార్ మల్లన్న మాట్లాడుతున్నారని ఆయన ఆరోపించారు.మల్లన్నకు న్యాయస్ధానం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిందని…. షరతులకు విరుధ్ధంగా వ్యవహరిస్తున్నమల్లన్న బెయిల్ రద్దు చేయాలని న్యాయస్ధానాన్ని కోరతామని దినేష్ చెప్పారు.