రెస్టారెంట్‌లో వీరంగం: భార్యపై వేధింపులు, భర్తపై బీర్ బాటిల్ తో దాడి

రెస్టారెంట్‌లో వీరంగం: భార్యపై వేధింపులు, భర్తపై బీర్ బాటిల్ తో దాడి

Updated On : November 13, 2019 / 9:26 AM IST

రెస్టారెంట్‌లో డిన్నర్ చేసేందుకు వెళ్లిన ఆ కుటుంబానికి వివాదాలు చుట్టుముట్టాయి. భార్య, కొడుకుతో పాటు సోదరుడు కుటుంబంతో కలిసి  వీకెండ్‌ డిన్నర్ కు ఓ గురుగ్రాంలోని ఓ రెస్టారెంట్ కు వెళ్లాడు ఓ వ్యక్తి. సోనా రోడ్ లోని సెక్టార్ 47 రెస్టారెంట్ లోని పక్క టేబుల్ పై మద్యం తీసుకుంటున్న వ్యక్తులు అతని భార్య గురించి అసభ్యంగా మాట్లాడటం మొదలుపెట్టారు. 

బాధితుడి కుటుంబం అదుపులో ఉండమని హెచ్చరించడంతో వాదన పెరిగింది. వారిలో ఓ వ్యక్తి దాడి చేసేందుకు వస్తుండటంతో ఆ కుటుంబం అక్కడి నుంచి వెళ్లిపోవాలని నిర్ణయించుకుంది. వెళుతుండగానే వారిలో ఒకరు వచ్చి బాధితుడి తలపై బీర్ బాటిల్ తో కొట్టాడు. ఆ దాడికి అక్కడే ఉన్న కుటుంబంలోని చిన్నారికి గాయాలయ్యాయి. ప్రతిఘటించడంతో దాడి తీవ్రమైంది. తోటి వారు స్పందించి గొడవను అదుపుచేశారు. 

పోలీసులను ఆశ్రయించి తన భార్యను వేధించారని, తనపై దాడికి దిగారని బాధితుడు సాదర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని సీసీటీవీ ఆధారంగా విచారణ చేపట్టారు. ఆ వీడియోలో జరిగిన ఘటనను పరిశీలిస్తున్నామని ఎఫ్ఐఆర్ నమోదు చేశామని ఎవ్వరినీ అదుపులోకి తీసుకోలేదని పోలీసు అధికారులు వెల్లడించారు.