Female Cop Dies : సెక్రటేరియట్‌లో చెట్టు కూలి మహిళా హెడ్‌కానిస్టేబుల్ మృతి
తమిళనాడులో కురుస్తున్న భారీ వర్షాలకు సెక్రటేరియట్‌లోని చెట్టు కూలి విధుల్లో ఉన్న ఒక మహిళా హెడ్ కానిస్టేబుల్ మృతి చెందింది.

Female Cop Dies As Tree Falls
Female Cop Dies : తమిళనాడులో కురుస్తున్న భారీ వర్షాలకు సెక్రటేరియట్‌లోని చెట్టు కూలి విధుల్లో ఉన్న ఒక మహిళా హెడ్ కానిస్టేబుల్ మృతి చెందింది. చెన్నై జార్జ్ టౌన్ లోని సెక్రటేరియట్ లో ముఖ్యమంత్రి సెక్యూరిటీ విభాగం వద్ద ఈరోజు ఉదయం ఒక భారీ వృక్షం నేల కొరిగింది. ఈ ఘటనలో ముఖ్యమంత్రి ప్రత్యేక భద్రతా విభాగంలో విధులు నిర్వహిస్తున్న కవిత అనే హెడ్ కానిస్టేబుల్ మరణించింది.
మరి కొందరు పోలీసులు గాయపడ్డారు. అక్కడే ఉన్న ఇతర భద్రతా సిబ్బంది చెట్టును పక్కకు తొలగించి ఆమెను రాజీవ్ గాంధీ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆమె మరణించినట్లు వైద్యులు తెలిపారు. SDRF సిబ్బంది చెట్టును తొలగించే కార్యక్రమం చేపట్టారు.
Also Read : Red Sandal wood Smugglers : ఎర్రచందనం స్మగ్లర్లు అరెస్ట్-కోటిన్నర విలువైన ఎర్ర చందనం స్వాధీనం
సమాచారం తెలిసిన ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ బాధితురాలి కుటుంబానికి రూ. 10 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. సోమవారం అర్ధరాత్రి నుంచి భారీ వర్షాలు చెన్నైను ముంచెత్తాయి. మరో మూడు రోజులు రాష్ట్ర వ్యాప్తంగా వానలు కురుస్తాయని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. దీంతో ప్రభుత్వం చెన్నై, కడలూరు, విల్లుపురం, అరియలూర్, పెరంబలూరు, మైలాదుతురై, తిరువణ్ణామలై, కొడైకెనాల్‌లోని పాఠశాలలకు ముందస్తు సెలవులు ప్రకటించింది.