నరరూప రాక్షసి : బాలికను చంపి రక్తం తాగిన మహిళ

నరరూప రాక్షసి : బాలికను చంపి రక్తం తాగిన మహిళ

రాక్షసులు.. దెయ్యం.. ఈ పదం వినగానే మనకు చమటలు పడతాయి. రక్తం తాగుతారని విన్నాం.. అప్పుడప్పుడు సినిమాలు, సీరియల్స్ లో చూశాం. ఇప్పుడు నిజ జీవితంలోనూ చూస్తున్నాం. అవును మనుషుల మధ్య, మనతోనే తిరుగుతున్న ఓ మహిళ.. ఆరేళ్ల బాలికను కిరాతకంగా చంపేసింది. ఆ తర్వాత తీరిగ్గా రక్తం తాగింది. వినటానికే ఒళ్లు జలదరిస్తోంది. ఇలాంటి మనుషులు ఉన్నారా అని.. నిజంగా ఉన్నారని చెబుతోంది ఏపీ రాష్ట్రం విశాఖపట్నంలో వెలుగులోకి ఓ ఘటన.

 

విశాఖ జిల్లా పెదబయలు మండలం లకేయుపుట్ట అటవీ ప్రాంతం. అనూష అనే బాలిక ఉంది. ఈ చిన్నారికి వంతల రష్మో అనే మేనత్త ఉంది. ఆమె తన భర్తతో కలిసి కట్టెల కోసమని చెప్పి కొండపైకి బాలిక అనూషను తీసుకెళ్లింది. అక్కడ బాలికను నరికి చంపింది. ఆ తర్వాత రక్తం తాగింది ఆమె. బాలిక కనిపించకపోవటంతో గ్రామస్తులంతా కొండల్లో వెతికారు. మృతదేహాన్ని చూసి ఆగ్రహానికి గురయ్యారు. ఆరా తీశారు.

 

బాలిక మేనత్త వంతల రష్మోను చెట్టుకు కట్టేసి దేహశుద్ది చేశారు. నిందితురాలు మద్యం మత్తులో ఈ దారుణానికి పాల్పడినట్లు స్థానికులు చెబుతున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు మద్యం మత్తులోనే ఇలా చేసిందా.. కుటుంబ కలహాలమైనా ఉన్నాయా అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. ఈ ఘటన తర్వాత చిన్నారులను బయటికి పంపాలంటేనే హడలెత్తిపోతున్నారు స్థానికులు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.