Missing Case: నైట్ షిఫ్ట్ జాబ్ చేయడానికి వెళ్లిన అమ్మాయి అదృశ్యం.. ఇంతకు ముందు కూడా..

ఆ యువతి ప్రతిరోజూ తన కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి వారితో మాట్లాడేది. చివరిసారిగా...

Kempegowda International Airport

అది బెంగూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం. టెర్మినల్ 1 వద్ద ఓ క్యాబ్ కంపెనీ బుకింగ్ రూమ్ ఉంటుంది. అందులో 27 ఏళ్ల ఓ యువతి నైట్ షిఫ్ట్‌లో బుకింగ్ ఏజెంట్‌గా పనిచేస్తుంది. నాలుగు రోజుల క్రితం రాత్రి సమయంలో పనికి వెళ్లిన ఆ అమ్మాయి ఇంటికి తిరిగి రాలేదు.

ఆమె ఏమైందో? ఎక్కడ ఉందో? ఎవరూ గుర్తించలేకపోతున్నారు. ఆ యువతి సోదరుడు కెంపెగౌడ విమానాశ్రయ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తుమకూరుకు చెందిన ఆ యువతి విట్ క్యాబ్ కంపెనీలో జాబ్ చేస్తోంది.

ఎయిర్‌పోర్టుకు సమీపంలోని హుణసామరనహళ్లిలోని పీజీ వసతి గృహంలో ఉంటోంది. ఆ యువతి ప్రతిరోజూ తన కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి వారితో మాట్లాడేది. చివరిసారిగా, గత నెల 29న మధ్యాహ్నం ఫోన్ చేసి ఆ రోజు నైట్ డ్యూటీలో ఉన్నానని చెప్పింది.

ఆ తర్వాత ఆమె కుటుంబానికి ఎలాంటి కాల్స్ రాలేదు. కుటుంబ సభ్యులు ఫోన్ చేయగా ఆమె ఫోన్ స్విచ్ఛాఫ్‌ అని వస్తోంది. మొదట ఫోనులో ఛార్జింగ్ అయిపోయిందేనని వారు అనుకున్నారు. అయితే, గత నెల 31న ఆమెకు ఫోన్ చేయగా మళ్లీ స్విచ్ఛాఫ్ అనే వచ్చింది. దీంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు.

ఆ యువతి సోదరుడు ఈ నెల 2న ఆమె ఉంటున్న ప్రాంతానికి, జాబ్ చేస్తున్న చోటుకి వెళ్లి ఆరా తీశాడు. తన నైట్ షిఫ్ట్ ముగించుకుని ఆ యువతి డిసెంబర్ 29 ఉదయం 6 గంటలకు బయలుదేరిందని అతనికి తెలిసింది. దీంతో పోలీసులకు అతడు ఫిర్యాదు చేశాడు. నెల వ్యవధిలో మహిళ అదృశ్యం కావడం ఇది రెండో కేసు.

నాలుగు నెలల్లో ఎయిర్‌పోర్ట్ పోలీస్ స్టేషన్‌లో నాలుగు మిస్సింగ్ కేసులు నమోదయ్యాయి. డిసెంబర్ 3న ఇండిగో కార్గో విభాగంలో ఉద్యోగం చేస్తున్న 22 ఏళ్ల ఆ యువతి అదృశ్యమైంది.

డిసెంబర్ 4న ఆ విమానాశ్రయం నుంచి బీహార్‌కు వెళ్లిన ఒక వ్యక్తి సొంత ప్రాంతానికి చేరుకోలేదు. విమానాశ్రయం లోపలే అతడు అదృశ్యమయ్యాడని ప్రచారం జరిగింది. గత ఏడాది సెప్టెంబరు 17న జాబ్ చేయడానికి ఢిల్లీ నుంచి విమానంలో వచ్చిన ఒక వ్యక్తి టెర్మినల్ 1 నుంచి అదృశ్యమయ్యాడు.

Pavala Syamala : దీనస్థితిలో ఉన్న పావలా శ్యామలకు కాదంబ‌రి సాయం..