ప్రతి 16 నిమిషాలకో అత్యాచారం.. భారత్‌లో మహిళలు భద్రమేనా?.. NCRB రిపోర్టులో షాకింగ్ నిజాలు

  • Published By: sreehari ,Published On : October 2, 2020 / 05:22 PM IST
ప్రతి 16 నిమిషాలకో అత్యాచారం.. భారత్‌లో మహిళలు భద్రమేనా?.. NCRB రిపోర్టులో షాకింగ్ నిజాలు

Updated On : October 2, 2020 / 5:45 PM IST

Women unsafe in India: భారతదేశంలో మహిళలకు భద్రత కరువైపోతోందా? దేశంలో మహిళలు సురక్షితమేనా? ఎక్కడ చూసినా మహిళలపై అత్యాచార ఘటనలే వెలుగులోకి వస్తున్నాయి. మహిళలపై నేరాలకు పాల్పడుతున్న కేసులు ఎక్కువగా నమోదవుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో 2019 ‘Crime in India’ నివేదికను National Crime Record Bureau (NCRB) రిలీజ్ చేసింది. ఈ నివేదికలో షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి.



ఈ గణాంకాలను పరిశీలిస్తే.. భారతదేశంలో మహిళల్లో భద్రత ఎంత ప్రమాదకరంగా మారిందో సూచిస్తోంది. ప్రతి 16 నిమిషాలకో అత్యాచారం జరుగుతోందని నివేదిక వెల్లడించింది. ఈ ఏడాదిలో హత్రాస్ గ్యాంగ్ రేప్, హత్య ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేకిత్తించింది.

ఉత్తరప్రదేశ్‌లో 19ఏళ్ల దళిత బాలికపై ఉన్నత వర్గానికి చెందిన నలుగురు సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన ఆందోళనలకు దారితీసింది. సెప్టెంబర్ 14 అత్యాచారానికి గురైన బాలిక ఢిల్లీలోని సబ్దర్ జంగ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. ఈ హత్రాస్ ఘటన అనంతరం NCRB లేటెస్ట్ రిపోర్టు రిలీజ్ చేసింది.



ఈ నివేదికలో భారతదేశంలో ప్రతి 16 నిమిషాలకు మహిళలు అత్యాచారానికి గురవుతున్నారని వెల్లడించింది. ప్రతి గంటకు ఒక కట్నం వేధింపుల మరణాలు నమోదవుతున్నాయి. అంతేకాదు.. ప్రతి నాలుగు నిమిషాలకు ఒక మహిళ తన భర్త లేదా అత్తా మామల క్రూరత్వానికి బలిపోతుందని డేటా వెల్లడించింది.



ప్రతి రెండు రోజులకు దాదాపు ఒక బాధితురాలు యాసిడ్ దాడికి గురవుతోందని 2019 NCRB రిపోర్టు రివీల్ చేసింది. భారతదేశంలో ప్రతి 30 గంటలకు ఒక మహిళ గ్యాంగ్ రేప్‌కు గురవుతోందని డేటా పేర్కొంది. ప్రతి రెండు గంటలకు ఒక మహిళపై అత్యాచారయత్నానికి పాల్పడుతున్న ఘటనలు జరుగుతున్నాయి. ప్రతి ఆరు నిమిషాలకు మహిళలపై దాడులు జరుగుతున్నాయి. మరో షాకింగ్ విషయం ఏమిటంటే.. ప్రతి నాలుగు గంటలకు ఒక మహిళను అక్రమ రవాణా లక్ష్యంగా మారుతుందని NCRB డేటా వెల్లడించింది.