Gurgaon : 6 నెలల్లో రూ.21 కోట్లు.. ఓ కూరగాయల వ్యాపారి ఎలా సంపాదించాడో తెలిస్తే షాకవుతారు

ఓ కూరగాయల వ్యాపారి 6 నెలల కాలంలో కోటీశ్వరుడు అయిపోయాడు. కూరగాయల వ్యాపారంలో అంత లాభం ఎలా గడించాడనుకుని పొరపాటు పడకండి.. అతనేం చేశాడో తెలిస్తే షాకవుతారు.

Gurgaon

Gurgaon : కోవిడ్ సమయంలో జీవనోపాధి కోసం కూరగాయల వ్యాపారం మొదలుపెట్టాడు. ఆ తర్వాత వర్క్ ఫ్రమ్ హోమ్ ఆఫర్లతో అనేక మందిని మభ్యపెట్టి రూ.21 కోట్లు సంపాదించినందుకు అరెస్టు అయ్యాడు. గుర్గావ్‌కి చెందిన రిషబ్ శర్మ అసలు ఏం చేశాడు?

గుర్గావ్ సెక్టార్ 9 కి చెందిన రిషబ్ శర్మపై 10 రాష్ట్రాల్లో 37 కేసులకు సంబంధించి ప్రత్యక్షంగా .. మరో 855 కేసుల్లో సహాయం అందించాడని పోలీసులు కేసు నమోదు చేసారు. ఉత్తరాఖండ్ పోలీసుల బృందం అక్టోబర్ 28 న అతడిని అరెస్టు చేసింది. ఇంతకీ అతను చేసిన నేరం ఏంటి? అంటే..

Sekhar Master : మా అమ్మాయి పేరు చెప్పి మోసం చేస్తున్నారు.. నమ్మొద్దు అంటున్న శేఖర్ మాస్టర్..

రిషబ్ శర్మ ఫరీదాబాద్‌లో కూరగాయలు, పండ్లు అమ్మేవాడు. కోవిడ్ సమయంలో భారీగా నష్టపోయాడు. కుటుంబాన్ని పోషించడం ఎలాగో అర్ధం కాని సమయంలో ఆన్‌లైన్ మోసాలకు పాల్పడే తన స్నేహితుడిని కలిశాడు. రిషబ్‌కి అతని స్నేహితుడు ఫోన్ నంబర్ల డేటా బేస్ అందించాడు. ఉద్యోగ ఆఫర్లతో ప్రజల్ని ఎలా ఒప్పించాలో కూడా చిట్కాలు చెప్పాడు.

స్నేహితుడి సాయంతో మోసాలు ప్రారంభించిన 6 నెలల్లో రిషబ్ శర్మ రూ.21 కోట్లు రాబట్టినట్లు డెహ్రాడూన్‌లోని డీఎస్పీ అంకుష్ మిశ్రా తెలిపారు. marriottwork.com అనే పేరుతో ఒక నకిలీ వెబ్‌సైట్ క్రియేట్ చేశాడు. ఇది స్టార్ హోటల్ చైన్ అసలు వెబ్‌సైట్‌ను పోలి ఉంటుంది. ఆగస్టు 4 న డెహ్రాడూన్‌కి చెందిన ఓ వ్యాపారవేత్తకు ఈ గ్రూపు హోటళ్లకు సమీక్షలు రాయడానికి ఉద్యోగం ఉందంటూ వాట్సాప్ మెసేజ్ వచ్చింది. రిషబ్ డీల్ చేసిన చివరి బాధితుడు ఇతనే. మాటలతో అతడిని బుట్టలో వేసి రూ.20 లక్షలు పెట్టుబడి పెట్టిన తర్వాత రిషబ్ శర్మ కాల్స్, మెసేజ్ లకు స్పందించడం మానేశాడు. ఆ తర్వాత మోసపోయానని వ్యాపారవేత్తకు తెలిసింది. ఇలా రిషబ్ శర్మ మోసాల చిట్టా చాలా పెద్దదే ఉంది.

Rocking Rakesh : ఇల్లు తాకట్టు పెట్టి.. KCR సినిమా తీస్తున్న జబర్దస్త్ రాకేష్.. మోసం చేశారు, భయపెట్టారు అంటూ ఏడుస్తూ..

ప్రస్తుతం ఊచలు లెక్కపెడుతున్న రిషబ్ శర్మపై మోసం, నేరపూరిత కుట్రల్లో భాగంగా IT చట్టంలోని నిబంధనల ప్రకారం డెహ్రాడూన్‌లోని సైబర్ క్రైమ్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసారు.