Rocking Rakesh : ఇల్లు తాకట్టు పెట్టి.. KCR సినిమా తీస్తున్న జబర్దస్త్ రాకేష్.. మోసం చేశారు, భయపెట్టారు అంటూ ఏడుస్తూ..
రాకింగ్ రాకేష్ నిర్మాతగా, మెయిన్ లీడ్ లో సినిమా చేస్తున్నాడు. ఇటీవలే గరుడవేగ అంజి(Garudavega Anji) దర్శకత్వంలో రాకేష్ మెయిన్ లీడ్ గా KCR (కేశవ్ చంద్ర రమావత్) అనే సినిమాని ప్రకటించారు.

Jabardasth Rocking Rakesh emotional about his movie KCR
Rocking Rakesh : జబర్దస్త్(Jabardasth) రాకింగ్ రాకేష్ అందరికి పరిచయమే. మెజీషియన్, మిమిక్రి ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలుపెట్టిన రాకింగ్ రాకేష్ ఆ తర్వాత జబర్దస్త్ లోకి ఒక ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చి అనంతరం టీం లీడర్ గా ఎదిగాడు. జబర్దస్త్ లో చాలా కాలం పాటు రాకింగ్ రాకేష్ గా స్కిట్స్ తో మెప్పించి కొన్నాళ్ల క్రితమే బయటకి వచ్చేశాడు. పలు సినిమాల్లో కమెడియన్ గా కూడా నటించాడు. ఇక అదే జబర్దస్త్ లో పరిచయమైనా సుజాతని పెళ్లి కూడా చేసుకున్నాడు రాకింగ్ రాకేష్.
అయితే ఒక్కసారిగా రాకింగ్ రాకేష్ నిర్మాతగా, మెయిన్ లీడ్ లో సినిమా చేస్తున్నాడు. ఇటీవలే గరుడవేగ అంజి(Garudavega Anji) దర్శకత్వంలో రాకేష్ మెయిన్ లీడ్ గా KCR (కేశవ్ చంద్ర రమావత్) అనే సినిమాని ప్రకటించారు. ఓ పోస్టర్ కూడా రిలిజ్ చేయగా ఇది అచ్చు తెలంగాణ సీఎం kcr లాగే ఉండటంతో వైరల్ గా మారింది. ఎలక్షన్స్ టైంలో ఈ సినిమాని ప్రకటించడంతో మరింత వైరల్ అయింది. ఈ పోస్టర్ లాంచ్ ని మినిష్టర్ మల్లారెడ్డి చేశారు.
అయితే ఈ సినిమాకు రాకేష్ నిర్మాత కావడంతో.. రాకేష్ అప్పుడే సినిమా తీసేంత కోట్లు సంపాదించాడా?, రాకేష్ ఎవరికైనా బినామీగా ఉన్నాడా? లేక రాకేష్ తో ఏదైనా పార్టీ వాళ్ళు డబ్బులు ఇచ్చి తీయిస్తున్నారా? అని వార్తలు వచ్చాయి. తాజాగా రాకింగ్ రాకేష్ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో వీటికి సమాధానాలు ఇచ్చాడు.
రాకింగ్ రాకేష్ మాట్లాడుతూ.. ఈ సినిమాకి ముందు వేరే నిర్మాత, రచయిత ఉన్నారు. కానీ వాళ్ళు నన్ను మోసం చేశారు. ఈ ప్రాజెక్టు మొదలైన కొన్నాళ్లకే ఆగిపోయేలా చేశారు. దీంతో నేనే ఈ సినిమాను తెరకెక్కించాలని అనుకున్నాను. సినిమా మొదలవ్వకముందే నా కార్ అమ్ముకున్నాను. ఈ సినిమాకి నాకు ఎవ్వరు డబ్బులు పెట్టట్లేదు, నేను ఎవ్వరికి బినామీ కాదు, ఏ పార్టీ వాళ్ళు నాకు డబ్బులు ఇవ్వట్లేదు. నేను ఎంతో ఇష్టపడి కొనుక్కున్న ఇల్లు తాకట్టు పెట్టి ఈ సినిమా తీస్తున్నాను అంటూ ఎమోషనల్ అయ్యారు. అలాగే ఈ టైటిల్ తో సినిమా ప్రకటించాక కొంతమంది ఫోన్లు చేసి సినిమా ఆపేయాలని బెదిరించారు అని చెప్పాడు.
Also Read : Bigg Boss 7 Day 56 : హమ్మయ్య మొత్తానికి ఒక అబ్బాయి ఎలిమినేట్ అయ్యాడు.. ఈ వారం ఎలిమినేషన్ అయింది ఎవరంటే?
ఇదంతా తెలిసినా మా అమ్మ, నా భార్య నాకు సపోర్ట్ చేస్తున్నారు. నా భార్య సుజాత ఈ సినిమాకు రైటర్ గా, అసిస్టెంట్ డైరెక్టర్ గా, కాస్ట్యూమ్ డిజైనర్ గా.. ఇలా అనేక పనులు చేస్తూ నాకు సపోర్ట్ ఇస్తుంది. తాను బ్యాంక్ లో దాచుకున్న డబ్బులు కూడా నాకు ఇచ్చింది అని చెప్పాడు రాకేష్. దీంతో రాకేష్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. మరి ఈ KCR సినిమా ఎప్పుడు వస్తుంతో, ఏ మేరకు విజయం సాధిస్తుందో చూడాలి.