Bigg Boss 7 Day 56 : హమ్మయ్య మొత్తానికి ఒక అబ్బాయి ఎలిమినేట్ అయ్యాడు.. ఈ వారం ఎలిమినేషన్ అయింది ఎవరంటే?
మొన్నటిదాకా వరుసగా ఏడు వారాలు అమ్మాయిలు ఎలిమినేట్ అయి తెలుగు బిగ్‌బాస్ హిస్టరీలోనే సరికొత్తగా నిలిచిపోయింది. దీంతో అమ్మాయిల ఎలిమినేషన్ కి బ్రేక్ వేస్తూ నిన్నటి ఎపిసోడ్ లో జెంట్ కంటెస్టెంట్ ఎలిమినేట్ అయ్యాడు.

Bigg Boss 7 Day 56 Highlights who eliminated from Bigg Boss
Bigg Boss 7 Day 56 : బిగ్‌బాస్ ఎనిమిదో వారం కూడా ముగిసింది. మొన్నటిదాకా వరుసగా ఏడు వారాలు అమ్మాయిలు ఎలిమినేట్ అయి తెలుగు బిగ్‌బాస్ హిస్టరీలోనే సరికొత్తగా నిలిచిపోయింది. దీంతో అమ్మాయిల ఎలిమినేషన్ కి బ్రేక్ వేస్తూ నిన్నటి ఎపిసోడ్ లో జెంట్ కంటెస్టెంట్ ఎలిమినేట్ అయ్యాడు.
శనివారం ఎపిసోడ్ లోనే నామినేషన్స్ లో ఉన్న ప్రియాంక, గౌతమ్ సేవ్ అయ్యారు. ఇక ఆదివారం రాగానే ఓ రెండు గేమ్స్ పెట్టారు. కాసేపు సరదాగా ఆ గేమ్స్ ఆడించారు. గేమ్స్ మధ్యలోనే అశ్విని, అమర్ దీప్, శివాజీ, భోలే సేవ్ అయినట్లు చెప్పారు నాగార్జున. చివరగా శోభాశెట్టి, సందీప్ మిగలగా వారిద్దర్నీ కాసేపు టెన్షన్ పెట్టి చివరకు సందీప్ మాస్టర్ ఎలిమినేట్ అయ్యారని చెప్పారు. దీంతో వరుసగా అమ్మాయిలు ఎలిమినేట్ అవుతున్న దానికి బ్రేక్ వేసి సందీప్ మాస్టర్ ఎలిమినేట్ అయ్యాడు.
సందీప్ మాస్టర్ ఎలిమినేట్ అవ్వడంతో శోభాశెట్టి కాసేపు ఏడ్చేసింది. మాస్టర్ మీరు వెళ్లొద్దంటూ ఏడ్చేసింది. సందీప్ స్టేజి పైకి వెళ్ళాక కూడా శోభాశెట్టి ఏడుస్తూనే ఉంది. ఇక హౌస్ లో శివాజీ గ్రూప్, అమర్ గ్రూప్ లుగా రెండు గ్రూప్ లు ఉన్న సంగతి తెలిసిందే. సందీప్ వెళ్లిపోవడంతో అమర్ గ్రూప్ కాస్త బలహీనపడినట్లే అని చెప్పొచ్చు. నేటి ఎపిసోడ్ లో నామినేషన్స్ హీట్ ఉండనుంది.