భార్య రెండవ పెళ్ళిని అడ్డుకున్న భర్త

  • Published By: chvmurthy ,Published On : April 28, 2019 / 04:02 PM IST
భార్య రెండవ పెళ్ళిని అడ్డుకున్న భర్త

Updated On : April 28, 2019 / 4:02 PM IST

ఆసిఫాబాద్: ఇప్పటివరకు భర్త రెండో పెళ్లి చేసుకుంటుంటే  భార్య వెళ్లి.. ఆపండి అంటూ గోల చేయడం చూశాం.. కానీ కోమురంభీం జిల్లాలో సీన్‌ రివర్స్‌ అయింది. భార్య రెండో పెళ్లిని భర్త అడ్డుకున్నాడు. పోలీసులు, న్యాయవాదితో కలిసి పెళ్లి వేదిక వద్దకు వెళ్లి పెళ్లిని అడ్డుకున్నాడు. దీంతో భర్తతో పాటు న్యాయవాదిపై భార్య తరపు బంధువులు దాడి చేశారు. దీంతో భర్త న్యాయం కోసం ఆదిలాబాద్‌ వన్‌ టౌన్‌ పోలీసులను  ఆశ్రయించారు. 

వివరాల్లోకివెళితే .. కోమురంభీం జిల్లాకు చెందిన సంజీవ్ అనే యువకుడు ఓ ఎస్సై కూతుర్ని ప్రేమించాడు. వీళ్ళిద్దరూ 2018 లో హైదరాబాద్ లో ఆర్య సమాజ్ లో పెళ్లి చేసుకున్నారు. ఇది జరిగిన కొన్నాళ్లకు ఎస్సై తన కుమార్తెను తన ఇంటికి తీసుకువెళ్ళాడు. ఎప్పటికైనా తన భార్య తిరిగి వస్తుందని ఆశతో ఉన్న యువకుడికి,  తన భార్యకు మళ్లీ పెళ్లి చేస్తున్నారని తెలిసింది. వెంటనే న్యాయస్ధానాన్ని ఆశ్రయించాడు.  స్పందించిన కోర్టు సంజీవ్ భార్యను వెతికి పెట్టమని పోలీసులను ఆదేశించింది. పోలీసులను , న్యాయవాదిని వెంటబెట్టుకుని ఆదివారం తన భార్యకు జరుగుతున్న పెళ్లి మండపం వద్దకు వెళ్లి పీటల మీద పెళ్లి ఆపు చేశాడు. దీంతో ఆగ్రహించిన  పెళ్లికి వచ్చిన యువతి బంధువులు అతడిపై దాడి చేసి, పెళ్లి కుమార్తెను మాయం చేశారు. తనకు న్యాయం చేయాలని ఆ యువకుడు ఆందోళనకు దిగాడు.