Hyderabad Crime: పాతబస్తీలో దారి కాచి యువకుడిపై కత్తులతో దాడి

హైదరాబాద్ పాతబస్తీ పరిధిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. బైక్ పై వెళ్తున్న యువకుడిని గుర్తు తెలియని దుండగులు అడ్డగించి ఆపై కత్తులతో దాడి చేశారు

Crime

Hyderabad Crime: హైదరాబాద్ పాతబస్తీ పరిధిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. బైక్ పై వెళ్తున్న యువకుడిని గుర్తు తెలియని దుండగులు అడ్డగించి ఆపై కత్తులతో దాడి చేసిన ఘటన సోమవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. రెయిన్ బజార్ పోలీసుల కధనం ప్రకారం.. యాకుత్‌పురా ఎస్ఆర్టి కాలనీకి చెందిన హిప్జ్ అనే యువకుడు సోమవారం రాత్రి బైక్ పై వెళ్తున్నాడు. యువకుడు బైక్ పై చోటాపుల్ లండన్ వంతెన వద్దకు చేరుకున్న క్రమంలో.. నలుగురు గుర్తు తెలియని దుండగులు అడ్డగించారు.

Also read: AP Govt. Vs Employees: ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం షాక్‌

తన వద్దనున్న డబ్బు, విలువైన వస్తువులు ఇవ్వాలంటూ దుండగులు బెదిరించగా.. ఏమీ లేవంటూ హిప్జ్ సమాధానం ఇచ్చాడు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన నలుగురు యువకులు .. కత్తితో అతన్ని పొడిచి పరారయ్యారు. ఘటనపై స్థానికులచే సమాచారం అందుకున్న రెయిన్ బజార్ పోలీసులు..ఘటన స్థలానికి చేరుకొని తీవ్రంగా గాయపడిన యువకుడిని ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Also read: Cricket Betting: క్రికెట్ బెట్టింగ్ కి పాల్పడుతున్న ముఠా అరెస్ట్